తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Young India Police School: ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ గురువారం స్కూల్ కు వెళ్లి స్వయంగా లాటరీ పద్దతి ద్వారా 45మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ లెటర్లను అందచేశారు. విధుల నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు సిబ్బంది తమ పిల్లల స్కూల్ అడ్మిషన్లు, చదువులపై పెద్దగా దృష్టిని కేంద్రీకరించ లేకపోతున్న విషయం తెలిసిందే.
Also Read: Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంచిరేవుల వద్ద భూమిని కేటాయించి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు మొదలవుతాయని, అడ్మిషన్లు కావాలనుకున్న వారు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఇటీవల కమిషనర్ సీ.వీ.ఆనంద్ ప్రకటించారు. ఒక్క తరగతిలో 40మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయని, వీటిలో యాభై శాతం పోలీసు సిబ్బంది పిల్లలకు మిగితా యాభై శాతం సీట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి భారీగా స్పందన వచ్చింది.
Also Read: Gajularamaram: అధికారులూ.. కాస్త ఒక లుక్ వేయండి ప్లీజ్..
తమ తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో అడ్మిషన్లు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని గురువారం కమిషనర్ సీ.వీ.ఆనంద్ స్కూల్ కు వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలోనే లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు లాటరీ ద్వారా ఎంపికైన 56మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ లెటర్లు ఇచ్చారు. వీరిలో 45మంది పోలీసు సిబ్బంది పిల్లలు ఉండగా 11మంది జనరల్ కుటుంబాలకు చెందిన వారన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు