WhatsApp Hacking: రకరకాలుగా మోసాలు చేస్తూ జనాన్ని నిలువునా ముంచుతున్న సైబర్ క్రిమినల్స్(Cybercriminals) తాజాగా వాట్సప్ హ్యాకింగ్‌కు పాల్పడుతూ లక్షలు కొల్లగొడుతున్నారు. వాట్సప్ ద్వారా లింక్ లేదా ఏపీకే ఫైల్‌ను పంపిస్తూ, అవతలి వారి ఫోన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఊడ్చేస్తున్నారు. అంతేకాకుండా, హ్యాక్ చేసిన ఫోన్‌లోని నెంబర్లకు అర్జంట్ అని మెసేజ్‌లు పంపిస్తూ డబ్బు గుంజుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు అధికం కావడంతో, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్(Shikha Goyal) హెచ్చరించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టార్జితాన్ని పోగొట్టుకోవడం ఖాయమని ఆమె తెలిపారు.
ముప్పై రకాలకు పైగా..
ముప్పై రకాలకు పైగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఏటా వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న నేపథ్యంలో, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, క్రిమినల్స్ కొత్త కొత్త మార్గాల్లో నేరాలు చేస్తూనే ఉన్నారు. వేర్వేరు మార్గాల ద్వారా మొబైల్ నెంబర్లు(Mobile Numbers), వ్యక్తిగత డేటా సంపాదిస్తున్న సైబర్ క్రిమినల్స్ ర్యాండమ్‌గా వందల సంఖ్యలో సెల్ ఫోన్లకు లింక్ లేదా ఏపీకే ఫైళ్లను వాట్సప్(WhatsApp) ద్వారా పంపిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్(Clik) చేసినా లేదా ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసినా మొబైల్ ఫోన్ వెంటనే సైబర్ క్రిమినల్స్ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఫోన్ నెంబర్లు అన్నీ మోసగాళ్ల చేతికి చేరుతాయి.
Also Read: Illegal Ration Rice: అక్రమంగా తరలిస్తున్న 295 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. ఎక్కడంటే..?
బీ అలర్ట్..
మరికొన్ని సార్లు సైబర్ క్రిమినల్స్ 21 నాలుగంకెల సంఖ్యను పంపించి దానికి కాల్ చేయమని సూచిస్తున్నారు. సైబర్ పోలీసులు చెబుతున్న ప్రకారం, ఈ నెంబర్ నిజానికి కాల్ ఫార్వర్డింగ్ కోడ్. ఆ నెంబర్‌కు పొరపాటున కాల్ చేస్తే, ఓటీపీ(OTP)లు, వెరిఫికేషన్ ఫోన్ కాల్స్ అసలు మొబైల్ సొంతదారుకు కాకుండా నేరగాళ్లకు వెళ్లిపోతాయి. వీటి ఆధారంగా సైబర్ క్రిమినల్స్ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంతోపాటు, కాల్ లాగ్‌లోని నెంబర్లకు ఫోన్లు చేస్తూ అత్యవసరంగా డబ్బు కావాలని నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఎలాంటి నెంబర్లకు ఫోన్లు చేయవద్దని గోయల్ స్పష్టం చేశారు. మొబైల్ హ్యాక్‘(Mobile hack) అయ్యిందని అనుమానం వస్తే, వెంటనే సెట్టింగుల్లోకి వెళ్లి కాల్ ఫార్వర్డింగ్‌ను డిసేబుల్ చేయాలని సూచించారు. ముఖ్యమైన ఫైళ్లను బ్యాకప్ చేసుకోవాలని, అనుమానాస్పద యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని, వీలైతే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయాలని తెలిపారు. యాప్స్‌ను ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయాలని, M–Kavach 2ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. మోసపోయిన వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చని ఆమె కోరారు.
Also Read: Illegal Ration Rice: అక్రమంగా తరలిస్తున్న 295 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. ఎక్కడంటే..?
