Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుకు రాజకీయ వేడి రగుల్చుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యవిమర్శ, ప్రతివిమర్శలకు వేదికైంది. మరోవైపు బీజేపీ సైతం విమర్శలకు పదునుపెట్టింది. ఇంతకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా సవ్యంగా జరిగిందని ప్రభుత్వం పేర్కొంటుందా? లేక బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా? లేకుంటే అధికారులపై నెట్టేస్తారా? అనేది చర్చకు దారితీసింది. తాను చెప్పింది వాస్తవం అంటూ తాను చెప్పిందే వాస్తమని వాదాలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ఎవరు చెప్పింది నిజం అనే అంశంపై ప్రజల్లో డైలామా నెలకొంది. ఈ విషయాన్ని కమిషన్ తేల్చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మాటల తూటాలు సైతం
కాళేశ్వరం కమిషన్ రాజకీయ నాయకుల విచారణను స్టార్ట్ చేసింది. దీంతో మాటల తూటాలు సైతం పేలుతున్నాయి. స్థానిక ఎన్నికలు రాకముందే రాజకీయ వేడిని రగుల్చుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని వాటితోనే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమని కాంగ్రెస్ అంటుంటే లేదు అన్ని ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లామని డీపీఆర్, అనుమతులు సైతం ఉన్నాయని బీఆర్ఎస్ పేర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నిగ్గుతేల్చాలని భావిస్తుంది. అందులో భాగంగానే కమిషన్ ను నియమించి స్పీడప్ చేసింది. ఇప్పటివరకు అధికారులను విచారించిన కమిషన్ గత ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రులుగా పనిచేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని సూచించింది. తరుణంలోనే మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ వేడిని రగిల్చింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల యుద్ధం
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేశాయని హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్కప్రాజెక్టుకు అనుమతి తీసుకురాలేదని, ఒక్క ప్రాజెక్టు కట్టలేదని మండిపడుతున్నారు. తాను చెప్పింది నిజం అని పేర్కొంటున్నారు. లేదులేదు నేను లెక్కలతో సహ నాదగ్గర ఉన్నాయని, చెప్పేది వాస్తవం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇద్దరు చెప్పేదవి వాస్తవాలు అయితే మరి ఎవరు తప్పుచేశారు? నిర్మాణ సంస్థ తప్పు చేసిందా? అనేది మరో చర్చజరుగుతుంది.
Also Read: Election Commission: రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్ ఫుల్ సీరియస్
68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందిస్తున్నారు. కాళేశ్వరంపై వృథాగా ఖర్చు పెట్టారన్నారని,ఆ ఖర్చును కృష్ణానదిపై 25,654కోట్లు పెట్టుంటే కృష్ణా ప్రాజెక్టులైన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవన్నారు. 25.64 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి ఇలా ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని మండిపడ్డారు. తొమ్మిది హట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టిసారించామన్నారు. అయితే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు సైతం లీకేజీ అవుతున్నాయని, ప్రజల సొమ్మును దుబారా చేశారని మండిపడుతున్నారు. నేను చెప్పింది వాస్తవం లెక్కలతో సహ చెబుతానని పేర్కొంటున్నారు.
మీలా బట్టకాల్చి మీదవేయం
కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువు అని హరీష్ రావు పేర్కొంటున్నారు. నూటికి నూరుశాతం వాస్తవాలు చెబుతున్నామని, ఆధారాలు, డాక్యుమెంట్లతో సహా చెబుతామన్నారు. కాంగ్రెస్ లాగా బట్టకాల్చి మీదవేయమని విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలకంటే తమకు రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. మేడిగడ్డ 85 పిల్లర్స్ లో 2 మాత్రమే కుంగాయని, కాళేశ్వరం కూలిందని దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆ రెండింటిని మరమ్మతులు చేస్తే సరిపోతుందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 141 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని, తెలంగాణలో ఎక్కువ స్టోరీ ఉన్న ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి ప్రాణహితచేవెళ్ల ప్రాజక్టుకు అనుమతులు తీసుకురాలేదని, ఏడాదిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చిందని మండిపడ్డారు.
డిజైన్లలో లోపాలు లేవు
తొలుత 17875కోట్లు కేటాయించి ఏ పనులు చేయకుండా 40వేలకోట్లకు పెంచారని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్లలో లోపాలు లేవు ఎస్ఎల్బీసీకి మూడువేల తొమ్మిదివందల కోట్లు ఖర్చుచేసి డిండి ఎత్తిపోతుల, పెండ్లిపాకల ప్రాజెక్టులను కంప్లీట్ చేశామని, 10కిలోమీటర్లు ఎస్ఎల్ బీసీ టన్నెల్ తవ్వామని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేయడం దారుణమన్నారు. కాళేశ్వరంలో నిధుల దుబారే జరగలేదని, రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Telangana Government: ఆటో రిక్షా కార్మికులకు.. ప్రభుత్వం గుడ్ న్యూస్!
బీజేపీ సైతం ఘాటుగా స్పందించడం
మరోవైపు బీజేపీ సైతం కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినదానిని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. అది ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థ అని కూడా విమర్శలు గుప్పిస్తుంది. అయితే దీనిపై బీజేపీ సైతం ఘాటుగా స్పందిస్తుంది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ పై ఈటల చేసిన విమర్శలకు కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. లక్షకోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందని విమర్శలు గుప్పించారు. ఈటల సైతం తన కణతపై తుపాకి పెట్టిన నిజమే చెబుతానని పేర్కొన్నారు. కమీషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టి నిజమైన దోషులను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోబోమన్నారు. రిపోర్ట్ బయట పెట్టాలని, శిక్షించక పోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. అందరూ నిజాలు చెబుతున్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
మరి తప్పేవరిది?
ఎవరికి వారుగా తాము చెప్పింది వాస్తవం అని పేర్కొంటున్నారు. అయితే ఇంతకు ఇద్దరిలో ఎవరు వాస్తవం చెప్పారు అనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. బీఆర్ఎస్ చెప్పింది వాస్తవం అయితే కాంగ్రెస్ ఎందుకు రాద్దాంతం చేస్తుంది. కాంగ్రెస్ చేసే విమర్శలు కరెక్టు అయితే తప్పుచేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది హాట్ టాపిక్ అయింది. కమిషన్ విచారణ తర్వాత ఎవరిది తప్పని తేలుస్తారు? అసలు తేలుస్తారా? మళ్లీ పెండింగ్ లోనే పెడతారా? అనేది కూడా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలతోనే సరిపుచ్చుతూ కాలం వెళ్లదీస్తారా? అని చూడాలి. లేకుంటే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తారా? ఒకరిపై ఒకరు విమర్శలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకుంటారా? అనేది కూడా చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ మాత్రం మళ్లీ ప్రజల్లో చర్చకు దారితీసింది.
Also Read: Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు