Telangana Government( image credit: twitter)
తెలంగాణ

Telangana Government: ఆటో రిక్షా కార్మికులకు.. ప్రభుత్వం గుడ్ న్యూస్!

Telangana Government: ఆటో రిక్షా కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాల అనుమతి సడలిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది.. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడం లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్య లో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో 263 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాలుష్యాన్ని తగ్గించడానికి 

హైదరాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)  ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.హైదరాబాద్ ( Hyderabad)  నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుదల, ఓఆర్ఆర్ లోపల ఏర్పడిన కొత్త లేఅవుట్ల, అపార్ట్మెంట్లు ఫలితంగా పట్టణీకరణ యొక్క వివిధ సవాళ్లు తలెత్తాయి. నగరంలో జనాభాలో అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ నగరంలో వాయు మరియు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్/ఎల్ పీజీ/సీఎన్జీ ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది.

 Also Read: Transport Commissioner: ఫిట్ నెస్ లేని వాహనాలపై.. కఠిన చర్యలు!

25 వేల వాహనాలకు అనుమతి

ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లకు అనుమతిఇచ్చింది. అదే విధంగా 10 వేల కొత్త ఎల్పీజీ ఆటో రిక్షాలకు, 10 వేల కొత్త సీఎన్జీ అటో రిక్షాలకు, డీజిల్ ,పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటో లకు రేటిరోఫీట్మెంట్ చేసి వాటి ఇంజన్ ను ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar)  తెలిపారు.

ప్రజా రవాణా ను మెరుగుపరచవచ్చు

ఇప్పటి వరకు ఉన్న డీజిల్ ,పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్సఫర్ లేదా డీజిల్ పెట్రోల్, కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించబడవు అని స్పష్టం చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు సీఎన్జీ, ఎల్పీజీ తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయన్నారు. ఓఆర్ఆర్ లోపల ప్రజా రవాణా ను మెరుగుపరచవచ్చు అన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. ఈ ప్రభుత్వ ఆదేశాల ద్వారా దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని పేర్కొన్నారు.

 Also Read:Series of thefts: మంచితనం ముసుగులో వరుస దొంగతనాలు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు