Transport Commissioner9 IMAGE CREDIT: SETCHA REPORTER)
తెలంగాణ

Transport Commissioner: ఫిట్ నెస్ లేని వాహనాలపై.. కఠిన చర్యలు!

Transport Commissioner: ఫిట్ నెస్ లేని విద్యాసంస్థల వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ , ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ( Chandra Shekar Goud)  నివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12నుంచి పాఠశాలలు పున: ప్రారంభమైతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పని సరి గా ఫిట్ నెస్ కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25677 విద్యా సంస్థల బస్సు లు ఉంటే ఇప్పటి వరకు 17020 బస్సు లు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 8657 బస్సు లు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఈ లోగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని తెలిపారు.

Also Read: Congress Leader: రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత.. మహిళా ఎస్సైపైనే దాడి.. వీడియో వైరల్

విద్యా సంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాలదే

15ఏళ్లు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల లో రోడ్ల పై తిరగరాదని, 15ఏళ్లు దాటిన బస్సు లు, ఫిట్ నెస్ లేని బస్సుల లో విద్యార్థులను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా సంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాల దే అని పేర్కొన్నారు. బస్సు మంచి కండిషన్ లో ఉంచడం తో పాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. పరిమితి కి మించి విద్యార్థులను తీసుకొని వెళ్లే వాహనాల పై సైతం తనిఖీలు ఉంటాయని తెలిపారు . అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో జిల్లా రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలతో, డ్రైవర్ల తో సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

 Also Read: Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా?

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు