AP TS Water Disputes
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

AP-TS Water Disputes: ఢిల్లీకి నీటి పంచాయితీ.. తేల్చుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

AP-TS Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయితీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నది. దీంతో హస్తినలోనే తేల్చుకోవడానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు.. ఎల్లుండి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలపై తేల్చుకునేందుకు సీఎంల హస్తిన బాట పట్టారు. ముఖ్యంగా బనకచర్ల అజెండాగా ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంలు భేటీ అయ్యి చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై అనేక వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB), సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. మరోవైపు.. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను బనకచర్ల ద్వారా రాయలసీమకు తరలించేందుకు ఉద్దేశించిన లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని చూస్తోంది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

Read Also-DGCA: జులై 21 గడువు.. ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ కీలక ఆదేశాలు

తెలంగాణ వాదన ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తమతో చర్చించకుండా కేంద్రానికి ప్రాజెక్టు డీపీఆర్ (Detailed Project Report) సమర్పించడం సరికాదని తెలంగాణ సర్కార్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అయితే.. ప్రాజెక్టుల ద్వారా నీటిని సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాలనేది తమ అభిమతమని, అయితే అది ఇరు రాష్ట్రాల మధ్య సంప్రదింపుల ద్వారా జరగాలని తెలంగాణ అంటోంది. గోదావరి జలాలపై తెలంగాణకు కూడా హక్కు ఉందని, తమ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించకూడదని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ ఈ జల వివాదాన్ని పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర పెద్దల సమక్షంలో లేదా నేరుగా భేటీ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబును చర్చలకు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ భేటీ ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సామరస్య పూర్వక పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Read Also- Nara Lokesh: నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్.. నెంబర్ వన్ సాధ్యమేనా?

మేమేంటో చూపిస్తాం!
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో ఉత్తమ్ ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో కోరారు. తెలంగాణలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులు, స్థితిగతులు, పరిణామ క్రమంపైన సవివరంగా లేఖలో ప్రస్తావించారు.

లేఖలో ఏముంది?
తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో తాజా పరిస్థితులు, పరిణామాలు, ఏపీ ఉల్లంఘనలు, ఉత్పన్నమైన సమస్యలు, భవిష్యత్తు ప్రమాదాలపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని లేఖలో కోరారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా- గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read Also- Vishal: గుడ్ న్యూస్ చెప్పిన విశాల్.. పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్ట్

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?