vishal (image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Vishal: గుడ్ న్యూస్ చెప్పిన విశాల్.. పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్ట్

Vishal: దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న హీరోల్లో విశాల్ ఒకరు. తమిళంతో పాటు ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్స్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘మధ గజ రాజా’ పూర్తి అయిన 12 సంవత్సరాల తర్వాత విడుదలై మంచి హిట్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత విశాల్ తన 35 సినిమాను ప్రముఖ నిర్మాత అయిన ఆర్‌బీ చౌదరి ప్రతిష్టాత్మక బేనర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ బేనర్ తెలుగు తమిళ చిత్రాల్లో అనేక విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. అనేక కొత్త దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం విశాలతో నిర్మిస్తున్న చిత్రం ఈ నిర్మాణ సంస్థకు 99 వ సినిమాగా విశాల్ కి 35 సినిమాగా ఉంది.

Also Read – B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

విశాల్, దుషార విజయన్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తు్న్న ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో కలిసి పని చేయనున్నారు. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేయనున్నారు.

Also Read – Congress leaders: ఆ జిల్లాల్లో ఎక్కువ కొట్లాటలు కార్యకర్తలు లీడర్లలో సమన్వయం కొరవ

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో నిర్వహించారు. నటులు కార్తి, జీవ లు పూజా కార్యక్రమంలో పాల్గొని స్ర్కిప్ట్ అందజేశారు. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య , మణిమారన్ , వెంకట్ మోహన్ , శరవణన్, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. విశాల్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని వస్తున్న వార్తలకు ఈ సినిమా ప్రారంభంతో ఫుల్ స్టాప్ పడింది. ఆయన ఆరోగ్యంగానే కనిపించారు. దీంతో ఫ్యాన్ కూడా విశాల్ అరోగ్యంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపీటలెక్కనున్నాడన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన నటి సాయి దన్సికను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?