Additional Collector Bribe Case: అడిషనల్ కలెక్టర్ ఇంట్లోనోట్ల కట్టలు
ACB-Raids (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Additional Collector Bribe Case: హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా డబ్బుల కట్టలు

Additional Collector Bribe Case:రూ.30 లక్షల 30 వేల 100 నగదు స్వాధీనం

శనివారం రూ.60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెంకటరెడ్డి

వరంగల్, స్వేచ్ఛ: శనివారం హనుమకొండ జిల్లా (Hanumakonda District) అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే వరంగల్ ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి నివాసంలో (Additional Collector Bribe Case) సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వెంకటరెడ్డి నివాసంలో రూ.30 లక్షల 30 వేల 100లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎక్కడిదని వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తే నా అవసర నిమిత్తం నా స్నేహితుడు భూపాల్ రెడ్డి దగ్గర నుంచి బదులుగా తీసుకున్నానని సమాధానం చెప్పాడు. భూపాల్ రెడ్డి ఎక్కడ ఉంటారని, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. దీంతో వెంకటరెడ్డి మాట మారుస్తూ భూపాల్ రెడ్డి అమెరికాలో ఉంటాడు.

Read Also- TGPSC Recruitment: రెండేళ్లలో ప్రభుత్వం 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఇవిగో లెక్కలు

అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని ఏసీబీ అధికారులకు వివరించాడు. నాకు డబ్బులు అవసరం ఉన్నాయని కోరితే తన డ్రైవర్ నుంచి పంపించాడని చెప్పాడు. ఈ డబ్బులు ఎన్ని రోజుల కింద తీసుకున్నారని ఏసీబీ అధికారులు అడిగితే నాలుగు ఐదు రోజుల క్రితం తీసుకున్నానని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి బదులిచ్చాడు. ఇంట్లో సోదాల్లో బయటపడిన లిక్కర్ విషయం అడిగితే మాకు సంబంధించిన బంధువులు తీసుకొచ్చి ఇచ్చారని అదనపు కలెక్టర్ సమాధానం చెప్పాడు. మొత్తంగా చూస్తే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అధికారులు మరింత లోతుగా సోదాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నట్లు సమాచారం.

Read Also- Actress Indraja: పబ్లిక్‌లో వల్గర్‌గా డ్రస్‌లు వేసుకునే వాళ్లకు ఆ మాట అనే అర్హత లేదు.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

రూ.2.51 కోట్లు హాంఫట్.. మోసపోయిన ఇద్దరు డాక్టర్లు

వరంగల్, స్వేచ్ఛ: సైబర్ నేరగాళ్లు రోజుకు రకమైన యాంగిల్ లో ప్రజల నుంచి డబ్బులను కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా హన్మకొండలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ డాక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో క్యూ ఆర్ కోడ్ ద్వారా పెట్టుబడి పేరుతో పంపిన డబ్బు తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇద్దరు యువ డాక్టర్లు ఈనెల మూడున పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగదు పెద్ద మొత్తంలో ఉండడంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. అయితే ఇద్దరూ చదువుకున్నవాళ్లే సమాజం మీద జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్లే కావడం గమనార్హం. ఇద్దరు కూడా డాక్టర్లై ఉండడం వారు కూడా అత్యాశకు పోయి నిలువ ఉన్న నగదును పోగొట్టుకోవడంతో సాధారణ ప్రజలకు వైద్యులకు తేడా ఏముందని చర్చించుకుంటున్నారు.

 

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు