Ganesh immersion 2025 (imagecredit:twitter)
తెలంగాణ

Ganesh immersion 2025: రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం.. సాగర తీరాన కిక్కిరిస్తున్న జన సంద్రం

Ganesh immersion 2025: పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనమైన పూజలందుకున్న గణనాధుడికి మహానగరవాసులు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బొప్పా మోరియా..జై భోలో గణేష్ మహారాజ్ కీ జై…జై..జై.గణేశా…బై బై గణేశా.. వెళ్లిరా..మళ్లీ రా గణపయ్య అంటూ భక్తులు చేసిన నినాదాలతో భాగ్యనగరం పులకించింది. గ్రేటర్ లోని మూడు పోలీసు కమిష్నరేట్ పరిధిలో నిమజ్జనం జరుగుతుండటంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. బ్యాండే మేళాలు, గల్లీగల్లీలో తీన్మార్ స్టెప్పులు, విచిత్ర వేషధారణలతో, ఆటలు, పాటలతో నిమజ్జనోత్సవాన్ని ఘనంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. గణనాధుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడిలోకి చేర్చారు. గణేశ్ నిమజ్జన సంబరాలు మహానగరంలో శనివారం అంబరాన్నంటాయి. నగరవాసులు ఈ సారి మరింత రెట్టింపు ఉత్సాహాంతో నిమజ్జనానికి రికార్డు స్థాయిలో జనం తరలి వచ్చారు. దీంతో సాగర తీరం జన సంద్రంగా మారింది. మహానగరంలోని గల్లీ గల్లీలు, వాడలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహానగరంలో ఎటు చూసినా ఆది దేవుడ్ని స్మరించే నినాదాలే. ముఖ్యంగా నగరంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ భారీ గణపయ్యలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలన్న పోలీసుల వ్యూహాం కాస్త ఆలస

పోలీసుల వ్యూహానికి ఈ సారి కాస్త అడ్డంకులే

ఉదయం ఆరున్నర గంటలకు ఖైరతాబాద్(Khairatabad) గణపయ్య నిమజ్జనం కోసం సాగర్ వైపు తరలగా, బాలాపూర్ గణనాధుడు కాస్త ఆలస్యంగా బయల్దేరినా, మధ్యాహ్నాం మూడు గంటల కల్లా పోలీసులు ఈ గణపయ్యను పాతబస్తీ దాటించారు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాధుడు తుది పూజలందుకుని, ఒకటి గంటల 42 నిమిషాలకు గంగమ్మ ఒడిని చేరాడు. ఈ భారీ గణపయ్య శోభయాత్ర రెండు కిలోమీటర్ల పొడువున ఆరు గంటల పాటు సాగింది. ఈ సారి బాలాపూర్ టూ హుస్సేసాగర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల పొడువున బాలాపూర్ గణేశుడ్నిమధ్యాహ్నాం ఒకటి గంటల్లోపు ఈ వినాయకుడ్ని చార్మినార్ దాటించాలన్న పోలీసుల వ్యూహానికి ఈ సారి కాస్త అడ్డంకులేర్పడ్డాయి. ఆరున్నర గంటలకు బాలాపూర్ గణనాథుడు ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 12 వద్ద బాలాపూర్ భారీ గణపయ్య నిమజ్జనమయ్యాడు. ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మకమైన, సున్నితమైన ప్రాంతాల్లో ముందస్తుగా ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు. మొత్తం 30 వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

మూడు కంట్రోల్ రూమ్ ల నుంచి పర్యవేక్షణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిష్నరేట్ లలో జరిగిన గణేష్ నిమజ్జనాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికపుడు మూడు కంట్రోల్ రూమ్ ల నుంచి పర్యవేక్షించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రెటెడ్ పోలీసు కమాండ్ కంట్రోల్, జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ తో పాటు డీజీపీ ఆఫీసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రం, మండపాల తరలింపునకు సంబంధించి సూచనలు జారీ చేశారు. డీజీపీ జితేందర్ నేరుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ చారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సైతం సీసీ నిఘా నేత్రాల ఫుటేజీని పరిశీలిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా వేగంగా జరిగేందుకు వీలుగా సూచనలు జారీ చేశారు. ఎప్పటికపుడు ఏరియల్ సర్వే నిర్వహిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా సూచనలు చేశారు. నగర పోలీసు కమిషనర్ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ నిమజ్జనం జరుగుతున్న తీరును నేరుగా పర్యవేక్షించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన దాసరిలు ఏరియల్ సర్వే నిర్వహించారు. మండప నిర్వాహకులు వీలైనంత త్వరగా నిమజ్జ

రెండో రోజు కొనసాగనున్న నిమజ్జనం

గణేశ్ ఫైనల్ నిమజ్జనం రెండో రోజైన ఆదివారం కూడా కొనసాగే అవకాశముంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి గణేశ్ మండపాలు కాస్త ఆలస్యంగా నిమజ్జనం వైపు కదలటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది. ముఖ్యంగా పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని చాలా ప్రాంతాల నుంచి వినాయక మండపాలు నిమజ్జనం కోసం సాయంత్రం ఐదు గంటల తర్వాత కదలటంతో నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నాం వరకు కొనసాగే అవకాశముంది. గత సంవత్సరం కూడా సాగర్ చుట్టూ మండపాలు క్యూ కట్టడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షల అమలును మధ్యాహ్నాం మూడు గంటల వరకు పొడిగించిన సంగతి తెల్సిందే. కనీసం ఆదివారం ఉదయం వరకైనా నిమజ్జనాన్ని ముగించే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన ప్రక్రియను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: CM New Helicopter: చంద్రబాబుకు కొత్త హెలికాఫ్టర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఆలస్యంగా కదిలిన పాతబస్తీ మండపాలు

పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి వినాయక మండపాలు సైతం నిమజ్జనానికి ఆలస్యంగా కదిలాయి. దీంతో నిమజ్జనం మరుసటి రోజైన ఆదివారం కూడా కొనసాగే అవకశాల్లేకపోలేవు. పైగా నగరంలో ఈ సారి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు లక్ష విగ్రహాలను ప్రతిష్టించినట్లు, ఇందులో హుస్సేన్ సాగర్ లో దాదాపు 40 వేల విగ్రహాలు నిమజ్జనం చేయనున్నట్లు సర్కారు అంచనా వేయగా, శనివారం రాత్రి వరకు కనీసం 20 వేల విగ్రహాలను కూడా నిమజ్జనం చేయలేదని తెల్సింది. శనివారం రాత్రి వరకు క్యూలో ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నాం వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు సమాచారం. ప్రతి మండపం వద్ద చివరి రోజు పూజా, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలస్యంగా కదిలిన మండపాల్లోని వినాయకులు శోభాయాత్ర రూట్ లో క్యూ కట్టాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రేన్లలో ఒక్కో క్రేన్ గంటకు గరిష్టంగా ఆరు విగ్రహాలు, కనిష్టంగా మూడు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నందున సాగర్ చుట్టూ, శోభయాత్ర జరిగిన బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ రూట్ లో విగ్రహాలు క్యూ కట్టాయి.

69 అడుగుల ఎత్తు..50 టన్నుల బరువు

ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, మొత్తం 50 టన్నుల బరువున్న భారీ గణపయ్యను బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల కు నిమజ్జనం ప్రాసెస్ స్టార్ట్ కాగా, ఒకటి గంటల 46 నిమషాలకు నిమజ్జనం సంపూర్ణమైంది. గణనాథుడు హుస్సేన్ సాగర్ లో సంపూర్ణ నిమజ్జనం అయ్యేందుకు దాదాపు 42 నిమిషాల సమయం పట్టింది. బాహుబలి క్రేన్ ను భారీ గణపయ్య నిమజ్జనం కోసం విజయవాడ నుంచి తెప్పించారు. ఎంతో నైపుణ్యత కల్గిన క్రేన్ డ్రైవర్ ను కర్నూలు నుంచి రప్పించినట్లు సమాచారం.

లడ్డూలకు పెరుగుతున్న క్రేజీ, రేటు

భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుని అన్ని రకాల శుభాలను ప్రసాదించే వినాయకుడి లడ్డూకు ప్రతి ఏటా క్రేజీ పెరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణనాధుడి లడ్డూ ఈ సారి దాదాపు 35 లక్షల రూపాయల ధర పలికింది. శనివారం ఉదయం నిర్వహించిన వేలంలో ఈ లడ్డూను కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. దీంతో పాటు బండ్ల గూడ రిచ్ మండ్ విల్లాలోని 20 మందితో కూడిన గ్రూప్ స్థానికంగా ప్రతిష్టించిన గణనాధుడి లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో రూ.2 కోట్ల 32 లక్షల ధర పలికింది. గతేడాది ఇదే లడ్డూ రూ. కోటి 87 లక్షల ధర పలికింది. ఈ లడ్డూ వేలంతో సమకూరిన రూ. 2.32 కోట్లు గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా పేద విద్యార్థుల చదువులకు చేయూతనివ్వనున్నట్లు రిచ్ బండ్ విల్లా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. మాదాపూర్ మై హోమ్ బూజా లడ్డూ ఈ సారి రూ.51 లక్షలు పలికింది.

Also Read; Donald Trump: చైనా కుట్ర చేసింది.. భారత్, రష్యాను కోల్పోయాం.. ట్రంప్ ఆవేదన!

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!