Endowment - Panchayat Raj (imagecredit:twitter)
తెలంగాణ

Endowment – Panchayat Raj: ఎండోమెంట్ శాఖ అభ్యర్ధనకు స్పందన కరువు

Endowment – Panchayat Raj: దేవాదాయశాఖలో చాలా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో శాఖ పనితీరు మెరుగుపడటం లేదు. దీంతో శాఖ బలోపేతానికి చర్యల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) ఉద్యోగుల నుంచి డిప్యూటేషన్ ప్రతిపాదన కోరింది. అయితే ఆశించిన స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. అయితే ఖాళీ పోస్టులను ఎలా భర్తీ చేసి కేడర్ ను ఎలా బలోపేతం చేస్తారనేది ఇప్పడు చర్చనీయాంశమైంది.

పంచాయతీరాజ్ అధికారులకు లేఖ

రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం మంజూరీ ఇచ్చినా పోస్టుల భర్తీలో ఆలస్యం కావడంతో శాఖకు సంబంధించిన ఫైల్స్ ముందుకు సాగడం లేదు. దీంతో ఆలయాల్లో చేపట్టాల్సిన పనులు వేగం సైతం మందగించినట్లు సమాచారం. దీంతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు పంచాయతీరాజ్​ శాఖ నుంచి అర్హులైన అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఎండోమెంట్​శాఖ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో దేవాదాయ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కావాలని, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్​జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు అర్హులైన అధికారులను గుర్తించి, వారి వివరాలను ప్రతిపాదించాలని ఆదేశించారు.

233 పోస్టులు మంజూరు

ఇదిలా ఉంటే దేవాదాయశాఖకు ప్రభుత్వం అనుమతితో 233 పోస్టులు మంజూరు కాగా.. 74 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలలో డిప్యూటీ కమిషనర్, ఆరుగురు అసిస్టెంట్ కమిషనర్లు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (గ్రేడ్-I), 61 మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (గ్రేడ్-III) ఉన్నాయి. నిర్దిష్ట వేతన స్కేల్స్ తోపాటు జోన్లవారీగా పోస్టింగ్​ ఇవ్వనున్నారు. డిప్యూటీ కమిషనర్1 పోస్టు (స్టేట్ కేడర్, జీతం రూ. 62,110 నుంచి రూ.1,40,470), అసిస్టెంట్ కమిషనర్ 6 పోస్టులు (మల్టీ జోనల్, జీతం రూ.51,320 నుంచి రూ.1,27,310), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I 6 పోస్టులు (జోనల్, జీతం రూ.42,300 నుంచి రూ.1,15,270), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III: 61 పోస్టులు (జిల్లా స్థాయి జీతం రూ. 24,280 నుంచి రూ.72,850) ఇవ్వనున్నారు. అధికారులు సంబంధిత మల్టీజోన్, జోన్, లేదా జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. వారి సేవలు శాశ్వత నియామకాలు జరిగే వరకు మాత్రమే కొనసాగుతాయి. ఈ పోస్టులకు అధికారులు అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ (ఎస్‌ఓ) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి అర్హులైన అధికారుల వివరాలు, వారి అనుమతితో వెంటనే సమర్పించాలని పీఆర్​, ఆర్డీ డైరెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓలకు ఆదేశించారు. అత్యవసరంగా, ప్రాధాన్యతగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Central on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి వినతిపై స్పందించిన కేంద్రం!

రెండు దరఖాస్తులే
దేవాదాయశాఖలో ఖాళీల భర్తీ కోసం పెట్టిన విజ్ఞప్తికి పంచాయతీరాజ్​ శాఖ ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. ఎండోమెంట్​లో ఖాళీల కొరత వేధిస్తోంది. గతనెల జూన్​ 16న అన్ని జిల్లాలకు సర్క్యులర్​ పంపించారు. ఉద్యోగుల నుంచి స్పందన వస్తుందని భావించారు. కానీ స్పందన రావడం లేదు. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు ఉన్న వెసులుబాటు ఎండోమెంట్ లో ఉండదని భావించి ముందుకు రావడం లేదని సమాచారం. అంతేగాకుండా ఎండోమెంట్స్ శాఖలో ఆలయ ఆస్తుల రక్షణ, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్ వంటి పనులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భావనతో ముందుకు రావడం లేదని సమాచారం. దీనికితోడు ఎండో మెంట్​లో డీసీ, ఏసీ, ఈవోలదే పైతనం అధికం కావడంతో డిప్యూటేషన్ పై వెళ్లేందుకు పీఆర్​ ఉద్యోగులు వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. ఈ శాఖలో ఉద్యోగుల మధ్య అంతర్గత పోరుతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావనతో విముఖత చూపుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మరోసారి ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొనున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.

సిబ్బంది కొరతతో ఇక్కట్లు
ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో దేవాదాయ శాఖ 11,051 మతపరమైన, దాతృత్వ సంస్థలను పర్యవేక్షిస్తోంది. ఇందులో 646 అసెసబుల్, 400 నాన్-అసెసబుల్ సంస్థలు ఉన్నాయి. ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణ, ఆర్థిక పర్యవేక్షణ, పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆలయ భూములు నిత్యం ఏదో ఒక దగ్గర భూములు అక్రమణకు గురవుతున్నాయి. మరోవైపు ఆలయాలకు వచ్చే ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు దేవాదాయశాఖలో ఖాళీలతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం భర్తీకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరోశాఖకు ఏమైనా లేఖలు రాస్తారా? లేకుంటే అవుట్ సోర్సింగ్ లేక కాంట్రాక్టు పరిధిలో ఏమైనా భర్తీ చేస్తారా? అనేది ఆసక్తి నెలకొంది.

Also Read: Jubilee Hills: ఉప ఎన్నికల జోష్.. రంగంలోకి మంత్రులు.. అభివృద్ధి పనులకు శ్రీకారం!

 

 

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!