Uttam kumar reddy: తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, అంతరాష్ట్ర జల విధానాలకు, జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుకు ఉందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అంగీకరించదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ కు లేఖలు రాశామని, ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాలను వివరించామన్నారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత వరకైనా పోరాడుతాం
ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని.. ఈ ఏడాది మే28న తెలంగాణకు పాటిల్ లేఖ రాశారన్నారు. ఏపీ పునర్విభజన చట్టప్రకారం ముందుకు వెళతామని పాటిల్ హామీ ఇచ్చారన్నారు. కేంద్రం చట్ట విరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత వరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నీటి హక్కులకోసం వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎంపీలు స్పందించాలని, కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.
కృష్ణానది జలాల్లో మోసం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి ఉందని, తెలంగాణకు అన్యాయం చేయవద్దని కోరారు. ప్రభుత్వంపై మొతుక్కునేవారికి ఈ లెటర్ చూపించాలని సూచించారు. మరో లెటర్ ను రిలీజ్ చేస్తానని వెల్లడించారు. కృష్ణానది జలాల్లో మోసం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అని ఆరోపించారు. ఏపీకి పదేళ్లు బీఆర్ఎస్ సహకరించిందన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణవాటా 724 టీఎంసీలు ఏపీకి వెళ్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు 1254 టీఎంసీలు తరలించారన్నారు. తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ పాలనలో అని మండిపడ్డారు.
Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!
డిండి ఇలా ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి
కాళేశ్వరంపై వృథాగా ఖర్చు పెట్టారన్నారు. ఆ ఖర్చును కృష్ణానదిపై 25,654కోట్లు పెట్టుంటే కృష్ణా ప్రాజెక్టులైన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి ఇలా ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని మండిపడ్డారు. తొమ్మిది హట్టి దగ్గర కాకుండా..మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది
2014 నుంచి 2023 వరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నేను చెప్పింది వాస్తవం అన్నారు. కృష్ణా నీళ్లలో అప్పుడు మోసం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నాటకాలాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్లు మరిచి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు. అంత డ్రామా మాకు రాదన్నారు. అసమర్దత, చేతకాని తనంతో కృష్ణానదిలో బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసిందన్నారు.
కేసీఆర్ ను ప్రగతిభవన్ లో జగన్ భేటీ
ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణ మరణశాసనం అన్నారు. ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందుకు కుట్రపూరితంగా ఆంధ్రాకు కేసీఆర్ సర్కార్ సహకరించింది నిజం అన్నారు. కేసీఆర్ ను ప్రగతిభవన్ లో జగన్ భేటీ అయ్యాయని, విందులు చేసుకొని నీళ్ల దోపిడీకి దోహదపడిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనకచర్ల పై బీఆరెస్ నేతలు పచ్చి అబద్ధాలు
పదేళ్లు కేసీఆర్,హరీష్ లు ఏపీ కోసమే పనిచేశారని, కృష్ణాలో నీటి ని తరలించారన్నారు.ఉమ్మడి ఏపీకంటే ముచ్చుమర్రి,మల్యాలలో పదేళ్ల కేసీఆర్ పాలనలోనే ఎక్కువగా నీటిని తరలించుకు పోయారన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు.. తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలేదన్నారు. జగన్-కేసీఆర్ రహస్యం ఒప్పందం లో భాగంగానే..తెలంగాణ అపెక్స్ మీటింగ్ వెళ్ళలేదని మండిపడ్డారు. బనకచర్ల పై బీఆరెస్ నేతలు పచ్చి అబద్ధాలు అన్నారు.
బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందని హితవు పలికారు. గోబెల్స్ బతికి వుంటే.. వీళ్లను చూసి ఆశ్చర్యపోయేవారు.. నన్ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కేంద్రానికి బకనచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని 10సార్లు లేఖలు రాసినట్లు ఉత్తమ్ వెల్లడించారు.
Also Read: Shocking Murder: వృద్ద దంపతుల.. దారుణ హత్య!