Uttam Kumar Reddy: తుమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం
Uttam Kumar Reddy (IMAGE CREDIT: TWITTER)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Uttam Kumar Reddy: తుమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మాణంపై.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది : మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి విషయంలో రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తునామన్నారు. మైలారం నుంచి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 14 కిలోమీటర్ల సొరంగం ద్వారా సుందిళ్లకు నీరు తరలించబడుతుందన్నారు.

అక్టోబర్ 22 నాటికి తీసుకుంటాం

మరో మార్గం ప్రకారం మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి యల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం అక్టోబర్ 22 నాటికి తీసుకుంటామని వెల్లడించారు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఖర్చు, హైడ్రాలిక్ సామర్థ్యం, భౌగోళిక అనుకూలత, విద్యుత్ అవసరాల సమీక్షించామన్నారు. రెండు ప్రతిపాదనలపై ఇంజనీర్లు రెండువారాల్లోపు నివేదిక ఇవ్వాలని కోరామన్నారు.

Also Read: Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ 2027 నాటికి పూర్తి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహితచేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్, అలాగే కాళేశ్వరం కింద మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయని తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. భూగర్భ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తెలంగాణ నీటి పారుదల నిర్మాణంలో కీలక భాగమని, ఇది శ్రీశైలం జలాశయాన్ని కరవు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూములకు కృష్ణా నదీ జలాలను అందించడానికి రూపొందించబడిందని చెప్పారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను తొలగిస్తున్నామని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

ఐఐటీ బృందం నిర్మాణ రూపకల్పన

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సంస్థలు, నిపుణ సంస్థలను పునరుద్ధరణ పనుల్లో పాల్గొనమని నోటిఫికేషన్ ఇచ్చామని, శాస్త్రీయ పద్దతుల్లో పారదర్శకంగా మరమ్మలు చేపడ్తామన్నారు. ఐఐటీ బృందం నిర్మాణ రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుందన్నారు. వర్షాకాలానికి ముందు పరీక్షలు పూర్తయ్యాయి, వర్షాకాలం అనంతరం పూర్తి పునరుద్ధరణ రూపకల్పన ఒక సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. వారానికి ఒకసారి పురోగతి సమీక్షలు నిర్వహించి సాంకేతిక ఫలితాలను పద్ధతిగా నమోదు చేయాలని ఆదేశించారు. “ఈ బ్యారేజీల భద్రత అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి దశలో జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంటూ శాస్త్రీయ, పారదర్శక , సవరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. డిండి ఎత్తిపోతలపై అధికారులు మూడ్రోజుల్లోగా నివేదిక అందజేయాలని సూచించారు.

ప్యాకేజీ-6, అదనపు మూడవ దశ ప్యాకేజీలకు ఆమోదం

అనంతరం సమ్మక్కసరక్క ప్రాజెక్టు పురోగతిపైనా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ను సంప్రదించి నీటి కేటాయింపు మరియు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టిఏసీ) ఆమోదం కోరిందని తెలిపారు. ఈ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోందన్నారు. దేవాదుల ప్రాజెక్టు శాఖ ప్రధాన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటన్నారు. ప్యాకేజీ-6, అదనపు మూడవ దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు. భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించి, అన్ని సవరించిన అంచనాలను (ఆర్‌ఈలు) ఈ నెలలోనే ఆమోదించాలని సూచించారు.

అదనపు ఇంజనీర్ల నియామకం

నీటి పారుదల రిజర్వాయర్ల మట్టిని, అవక్షేపాలను తొలగించడం పై ముసాయిదా విధానాన్ని సమీక్షించారు. ఈ ప్రతిపాదన అదనపు ప్రభుత్వ వ్యయం లేకుండా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచే స్వయం సమర్థ విధానాన్ని రూపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఇంటర్-స్టేట్ వాటర్ రిసోర్సెస్ (ఐఎస్‌డబ్ల్యూఆర్డ్), చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) బలోపేతం సమర్థవంతమైన రూపకల్పన, పర్యవేక్షణకు అత్యవసరమన్నారు. అదనపు ఇంజనీర్ల నియామకం, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ , ఆధునిక రూపకల్పన సాఫ్ట్‌వేర్ వినియోగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండుగా ఉంచాలని, హైడ్రాలజికల్ సీజన్ ముగిసే వరకు టెలీమెట్రీ ఆధారిత పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

 Also Read: Rajasthan Crime: రూ.100 కోసం.. వ్యాపారవేత్త దారుణ హత్య.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..