TPCC: తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) తన సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఇద్దరు కీలక నేతలకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మునిసిపల్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీపీసీసీ ప్రత్యేక ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి(Gutta Amit Reddy)ని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Edulapuram Municipality: ఎదులాపురం మున్సిపాలిటీలో.. అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు..?
అమిత్ రెడ్డి కీలక పాత్ర
ఎన్నికల వ్యూహరచన, సమన్వయం మరియు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించడంలో అమిత్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఓబీసీ విభాగం చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య(MLA Shankarayya)ను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్(KC Venugopal) ప్రకటించారు. శంకరయ్యతో పాటు డాక్టర్ కేతూరి వెంకటేష్ ,డాక్టర్ జూలూరు ధనలక్ష్మి లను కన్వీనర్ గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నియామకాల పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Ajit Pawar Dies: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం

