GPO Recruitment: జూన్ 2 నుంచి గ్రామాల్లో గ్రామ పరిపాలన అధికారులు పనిచేయనున్నారు. ఇప్పటికే జీపీవో(గ్రామ పరిపాలన అధికారులు) ఎగ్జామ్ పూర్తి కాగా, నేడో, రే పో ఫలితాలను కూడా ఇవ్వనున్నారు. దాదాపు 5,400 మంది జీపీవోలను రిక్రూట్ చేయనున్నారు. దీంతో గ్రామాల్లో వ్యవస్థ బలోపేతం కానున్నదని ప్రభుత్వం చెప్తుంది. పరిపాలన పటిష్టం కావడంతో పాటు పబ్లిక్ కు సులువుగా సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని సర్కార్ వ్యక్త పరుస్తుంది. వాస్తవానికి గతంలో వీఆర్ ఏ, వీఆర్ ఏ వ్యవస్థ ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. పూర్వపు వీఆర్ ఏ, వీఆర్ వోలను ఇతర శాఖల్లో మెర్జ్ చేశారు. ఇప్పుడు గ్రామ పాలన అధికారి పేరిట రెవెన్యూ పాలనను పటిష్టం చేయనున్నారు. వీఆర్ఏ, వీఆర్ వోల తరహాలోనే జీపీవోలు పనిచేయనున్నారు.
మరోసారి నోటిఫికేషన్
దాదాపు పది వేల పోస్టులు నింపాలని ప్రభుత్వం ప్రయత్నించగా, ఇందులో 9600 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీర్వో కేటగిరీ నుంచి 3534 మంది, వీఆర్ ఏ కేటగిరీ నుంచి 5987 మంది దరఖాస్తు చేకున్నారు. అయితే సర్వీస్ జీరో అవుతుందనే అనుమానంతో కొందరు అప్లికేషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఆఖరికి సుమారు ఆరు వేల మంది ఎగ్జామ్ రాసినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన జీపీవోలు రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులకు సర్కార్ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది. జీపీవోలతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారాన్ని చూపుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూమికి సంబంధించిన పట్టాలు, రికార్డులు నిర్వహాణ, సరిహద్దుల నిర్వహణ వంటివన్నీ పరిష్కరించబడతాయి. ఇక కొత్త గా భూ భూరతి చట్టం అందుబాటులోకి రానున్న తరుణంలో జీపీవో లు కీలక పాత్ర పోషించనున్నారు.
Also Read; Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!
పరిపాలన మెరుగుపడే అవకాశాలు
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే నాటికి వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఉండేవారు. రెవెన్యూ వ్యవస్థ రద్దు చేయడంతో వారిని ఇతర శాఖలకు సర్దుబాటు చేశారు. వీరిలో ఇంటర్ విద్యార్హతతో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు, డిగ్రీ విద్యార్హతతో నేరుగా జీపీవోల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామస్థాయిలో అధికారులను నియమిస్తే పరిపాలన మెరుగుపడే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం. గ్రామ పాలన అధికారి వ్యవస్థను తెరపైకి తెచ్చింది. జీపీవోలతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూమికి సంబంధించిన పట్టాలు, రికార్డుల నిర్వహణ, భూముల సరిహద్దుల వివాదాల పరిష్కరించేందుకు వీరు ఉన్నతాధికారులకు సహాయపడనున్నారు.
Also Read: Narsi Reddy: ఎవరీ నన్నూరి నర్సిరెడ్డి.. చంద్రబాబుకు ఎందుకంత ఇష్టం?