Suchata Chuangsri: మిస్ వరల్డ్ పోటీలు ముగిసిన వారం రోజులు గడిచినా విజేత సుచాత ఇంకా హైదరాబాద్ లోనే ఉండటంతో చర్చనీయాంశమైంది. మిగిలిన కంటెస్టులంతా ఈ నెల 2,3 తేదీల్లోనే తెలంగాణ విడిచి ఆయా దేశాలకు వెళ్లిపోయారు. కానీ విన్నర్ మాత్రం చువాంగ్ శ్రీ మాత్రం తెలంగాణలో ఉండటం హాట్ టాపిక్ అయింది. అయితే ఆమె వారం రోజులపాటు ఇక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి గానీ, స్పాన్సర్ల నుంచి ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు. ఆమె స్టే పై గోప్యత ఉంచడం గమనార్హం. వారం రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడన్‌గా సోమవారం సాయంత్రం ‘ఛాంపియన్స్ బిహైండ్ ద క్రౌన్’లో ప్రత్యక్షం అయ్యారు. దీంతో ఆమె ఈ వారం రోజులు ఇక్కడే ఉన్నారా? అనే చర్చ మొదలైంది. ఆమె తెరమీదకు ఎక్కడ కనిపించకపోవడంతో అధికారులు సైతం అవాకయ్యారు. ఆమె బసను ప్రభుత్వం ఎందుకు సీక్రెట్‌గా ఉంచిందో అర్ధంకావడం లేదని స్వయంగా పలువురు అధికారులే నాలుకకర్చుకున్నారు.
మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాతా
రాష్ట్రంలో మే 7వ తేదీన మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. అదే నెల 31న ముగిశాయి. విజేతను సైతం ప్రకటించారు. ఆతర్వాత జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్‌లో గవర్నర్ మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాతా తో పాటు రన్నర్స్ ను సత్కరించారు. మరుసటి రోజూ అందరు ఆయా దేశాలకు వెళ్లారు. కానీ మిస్ వరల్డ్ విజేత మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు. ఆమె గత ఏడెనిమిది రోజులుగా ఎందుకు ఉన్నారనేది సర్వత్రా చర్చజరుగుతుంది. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు. కేవలం ఛాంపియన్స్ బి హైండ్ ది క్రౌన్ పేరిట టూరిజం శాఖ ఈ నెల 9న నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం వారం రోజుల పాటు ఉన్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏదైన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే పాల్గొనేందుకు వచ్చిన ఆయా దేశాల మిస్ లు పోటీలు ముగియగానే వెళ్తారు. కానీ మిస్ వరల్డ్ విజేత మాత్రమే హైదరాబాద్ లో ఎందుకుఉన్నారనేది ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది.
Also Read: Mahabubabad: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో నయా మోసం
యువతి కాళ్లు కడిన ఘటన
మిస్ వరల్డ్ పోటీలు ఆదినుంచి వివాదాలకు నిలయంగా మారాయి. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ఆశించిన స్థాయిలో స్పాన్సర్లు రాకపోవడం, టూరిజం శాఖలోనే అధికారుల మధ్య విభేదాలు, వరంగల్ లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణి కాళ్లను తెలంగాణకు చెందిన యువతి కాళ్లు కడిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇంగ్లాడ్ మిస్ మిల్లా మాగి సైతం పోటీలపై ఆరోపణలు చేసింది. పురుష స్పాన్సర్ల ముందు కోతుల మాదిరి ఆడిస్తున్నారని వ్యాఖ్యానించింది. పోటీ అంటేనే విరక్తి కలిగేలా చేశారని.. విలువలు లేని చోట మనసు చంపుకొని ఉండలేనని నాకు నేనే పోటీ నుంచి తప్పుకుంటున్నా అని కంటతడి పెడుతూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనికి అధికారులు, మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు సైతం వివరణ ఇచ్చారు. ఈ తరుణంలో మిస్ వరల్డ్ విజేత వారం రోజులుగా తెలంగాణలోనే ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Muda case: సీఎంకు షాక్.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్