General Administration Department: జీఏడీ వర్సెస్ డిపార్ట్ మెంట్స్..? ప్రమోషన్లు, పోస్టింగ్ లలో జాప్యమే కారణమా?
General Administration Department(image credit:X)
Telangana News

General Administration Department: జీఏడీ వర్సెస్ డిపార్ట్ మెంట్స్..? ప్రమోషన్లు, పోస్టింగ్ లలో జాప్యమే కారణమా?

 General Administration Department: జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ) పనితీరుపై ఇతర శాఖల్లో అసంతృప్తి నెలకొన్నది. జీఏడీ విభాగం లో ఫైళ్లన్నీ పేరుకు పోతుండటంతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలోని జీఏడీ సెక్షన్లలో ఫైళ్ల పెండింగ్ పై అధికారుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వివిధ శాఖల ప్రమోషన్లు, ఉద్యోగుల పోస్టింగ్ ల ఫైళ్లన్నీ నెలల కొద్ది పెండింగ్ పెడుతున్నారని ఇతర శాఖల అధికారులు మండిపడుతున్నారు. ఒక్కో ఫైల్ కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, పరిస్థితి మారలేదని సంక్షేమ శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ప్రభుత్వంలోని కీలకంగా ఉన్న జీఏడీ పనితీరు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ? అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సిచ్వేషన్ లేదని ఆయన వెల్లడించారు. సాధారణ శాఖలతో పాటు ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్స్ ఫైళ్లను కూడా డీలే చేస్తున్నట్లు సమాచారం. హెల్త్, పోలీస్, ఫైర్ తో పాటు ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వంటి శాఖ ఫైళ్లను నెలల తరబడి క్లియర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. జీఏడీ అధికారులు, స్టాఫ్​ అలసత్వంతో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు అవాక్కాల్సిన పరిస్థితి ఉన్నది.

స్పష్టంగా నిర్లక్ష్యం…?

ప్రభుత్వంలోని వివిధ శాఖల తో జీఏడీ సమన్వయమై ఉంటుంది. వివిధ శాఖల ఫైళ్లన్నీ జీఏడీ నుంచి అనుసంధానమై ప్రభుత్వానికి చేరుతుంటాయి. సీఎం, మంత్రుల నుంచి అప్రూవల్ పొందిన ఫైళ్లు జీఏడీ కి చేరి, వివిధ శాఖలకు ఆదేశాలు అందజేస్తుంటాయి. వివిధ శాఖల కామన్ రూల్స్, సర్వీస్ రూల్స్, ఉద్యోగి వేతనాలు, రిటైర్మెంట్, పెన్షన్ వంటి వర్క్స్ ఫైళ్లన్నీ జీఏడీ క్రాస్ చెకింగ్ చేస్తుంది. వివిధ శాఖలు పంపిన ఫైళ్లు సక్రమంగా ఉన్నాయా? లేదా? సర్వీస్ రూల్స్ , సీనియారిటీ, వెకెన్సీలు, వంటివి చెక్ చేసి ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది.

Also read: MLC Kavitha: కవిత ధర్నాకు వారు దూరం? అసలెందుకిలా?

ఇక డీపీసీ ల విషయంలోనూ చెకింగ్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ తో సమన్వయమై, ఎప్పటికప్పుడు వివిధ శాఖ లకు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. రికార్డులు, డేటా ఎంట్రీ వంటివన్నీ ఫర్ ఫెక్ట్ గా ఉన్నాయా? లేదా? అని జీఏడీ మానిటరింగ్ చేస్తుంది. అయితే రోజుల్లో క్లియర్ కావాల్సిన ఫైళ్లను నెలల తరబడది పెండింగ్ పెట్టడటంతో ఇప్పుడు ఇతర శాఖల నుంచి వ్యతిరేకత వస్తోన్న ది. కొన్ని ఫైళ్లను కావాలనే హోల్డ్ లో పెడుతున్నారనే ప్రచారం కూడా ఉద్యోగుల్లో ఉన్నది. ఈ శాఖలోని కీలక అధికారి నిర్లక్ష్​యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని అదే శాఖలో పనిచేసే ఓ కింది స్థాయి ఉద్యోగి చెప్పడం గమనార్హం.

మెడికల్ కాలేజీల అనుమతులకు షాక్..?
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కొనసాగుతున్నది. అయితే ఆయా కాలేజీల్లో ప్రిన్సిపా ళ్లు, సూపరింటెండెంట్ లను నియమించాలంటే అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు జరగాలి. వైద్యారోగ్యశాఖ నుంచి ఈ ఫైల్ సెక్రటేరియట్ లోని జీఏడీకి చేరి రెండు నెలలు కావోస్తుంది.కానీ ఇప్పటి వరకు జీఏడీ నుంచి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ ఫైల్ అప్రూవల్ అయితేనే రెగ్యులర్ విధానంలో మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ లను నియమిస్తుంది. డీఎంఈ ఆఫీస్, హెల్త్ సెక్రటరీ ఆఫీస్ స్టాఫ్​ చెప్పులు అరిగేలా తిరిగినా, జీఏడీ అధికారులు ఈ ఫైల్ ను క్లియర్ చేయడం లేదు.

కీలకమైన ఫైల్ అని చెప్పినా, జీఏడీ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఇక ఇదే నెలలో నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలు ఉండే ఛాన్స్ ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఎన్ ఎంసీ తనిఖీల్లో రెగ్యులర్ విధానంలో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ లేరని గుర్తిస్తే మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. ఏడాది దాటినా రెగ్యులర్ స్టాఫ్​ ను రిక్రూట్ మెంట్ చేయలేదని ఎన్ ఎంసీ మండిపడే ఛాన్స్ కూడా ఉన్నది. ఇక ప్రస్తుతం 74 ఏడీఎంఈలు అవసరం ఉండగా, కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ విధానంలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్లంతా ఇన్ చార్జీ విధానంలో వర్క్ చేస్తున్నారు.

Also read: Ram Charan Peddi Movie: ” పెద్ది ” దెబ్బకు రికార్డులు బ్రేక్.. రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన రామ్ చరణ్

ఇవన్నీ వివరించినా జీఏడీ అధికారుల్లో చలనం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.మరోవైపు ‘తమకు ఇలాంటి ఫైళ్లు ఎన్నో వస్తాయి. మీకు ఎమర్జెన్సీ. మాకు కాదు ’అంటూ జీఏడీ లో ఓ అధికారి నిర్లక్ష్యంగా చెప్పడం గమనార్హం. ఈ ఒక్క శాఖ మాత్రమే కాదు. ఉద్యోగుల అంశం నుంచి వివిధ శాఖల కు కీలకంగా ఉన్న ఫైళ్లను కూడా పెండింగ్ పెడుతున్నారని సచివాలయంలోని మరో ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఈ శాఖ ప్రక్షాళన అవసరం అంటూ ఆయన నొక్కి చెప్పారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?