MLC Kavitha(image credit:X)
తెలంగాణ

MLC Kavitha: కవిత ధర్నాకు వారు దూరం? అసలెందుకిలా?

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నిర్వహించే ధర్నాకు గులాబీ పార్టీలో బీసీలు దూరం కానున్నారు. పార్టీకి సంబంధం లేకుండా ఆమె స్వతహాగా జాగృతి పేరుతో నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ సీనియర్లు సైతం పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటివరకు ఆమె బీసీ వాదంతో నిర్వహించిన సమావేశాల్లో సైతం పార్టీ నేతలు పాల్గొనలేదు. అయితే పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్న తరుణంలోనే ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారా? మరే ఇతర కారణామాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీసింది.

అసెంబ్లీలో ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా గళం వినిపిస్తుంది. బీసీ ఆత్మబంధువు ఫూలే అందరికి మార్గదర్శి అని ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తుంది. స్పీకర్ కు, మండలి చైర్మన్ లకు సైతం వినతిపత్రాలు ఇచ్చింది. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో మంగళవారం ఇందిరా పార్కు(ధర్నా చౌక్ )లో ధర్నా చేపట్టింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ జాగృతి, ఫూలే ఫ్రంట్ పేరుమీదనే విగ్రహం ప్రతిష్టపై డిమాండ్ చేస్తుంది. పార్టీకి ఎలాంటి సంబంధి లేకుండా ముందుకు సాగుతుంది.

Also read: Dilsukhnagar Bomb Blast: దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కు 12 ఏళ్లు పూర్తి.. తుది తీర్పు నేడే..

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకు సాగుతుందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ధర్నాకు పార్టీకి చెందిన బీసీ నేతలు మాత్రం దూరంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధం లేకపోవడంతోనే పాల్గొనడం లేదని పార్టీకి చెందిన సీనియర్ నేతలు తెలిపారు. ఆమె బీసీ నినాదం ఎతుక్కున్నప్పటి నుంచి ఆమె కుల సంఘాలతోనే భేటీ అవుతూ ముందుకు సాగుతుంది. కానీ పార్టీ నేతలతో భేటీఅయిన సందర్భాలు లేవు.
ఫూలే ఫ్రంట్ పేరుతోనే…
బీసీ వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. అందులో బాగంగానే పూలే అంశంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపైనా గళం వినిపిస్తుంది. పూలేవిగ్రహం, బీసీలను ఏకం చేయాలనే లక్ష్యంతో ఫూలే ఫ్రంట్ ను సైతం ఏర్పాటు చేసింది. పార్టీకి సంబంధం లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ధర్నా కార్యక్రమాలు సైతం చేపట్టింది. దీంతో పార్టీ నేతలు ఎవరు మాత్రం ఆమె చేపట్టే కార్యక్రమాలకు కలిసి రాకవడం లేదు.
గులాబీపార్టీలోని బీసీలు గుర్రు
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. గులాబీ పార్టీలో బీసీ నేతలు సీనియర్లు ఉన్నారు. రాజకీయ అనుభవం ఉన్నవారు సైతం కీలకంగా ఉన్నారు. మాజీమంత్రులు, పార్టీలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ కవిత మాత్రం బీసీ నేతలతోనూ సంప్రదింపులు చేయలేదు. బీసీ వాదంతో ముందుకు సాగుతున్నప్పటికీ బీసీ నేతలను కలుపుకుపోవడం లేదని పలువురు గుర్రుగా ఉన్నారు. తాము బీసీలం అయినప్పటికీ ఏకపక్షంగానే ముందుకు వెళ్తుందని, దీంతో బీసీ వర్గాల్లో తమకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలుపుకొని పోతే కవిత చేసే పోరాటానికి మరింత సపోర్టు లభిస్తుందికదా? అని అభిప్రాయపడుతున్నారు. తాము కూడా బీసీనేతలుగా మరింత బలపడే అవకాశం ఉంటుందని, చేసే పోరాటానికి ప్రజల నుంచి మరింత ఆదరణ లభిస్తుందని పేర్కొంటున్నారు.
స్వతహాగా నేతగా ఎదిగేందుకేనా?
పార్టీకి సంబంధం లేకుండానే మహిళా, బీసీ అంశాలతో ప్రజల ముందుకు కవిత వెళ్తున్నారు. ఒకవైపు జాగృతి కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. మరోవైపు ఫూలే ఫ్రంట్ తో బీసీ హక్కులపై పోరాటం స్టార్ట్ చేశారు. ఆమె దూకుడు రోజురోజుకు మరింత పెంచడంతో చర్చకు దారితీసింది. ఆమె పార్టీతో సంబంధం లేకుండా స్వతహాగా, బలమైన నేతగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారా? అనే ప్రచారం ఊపందుకుంది. తనకంటూ ఒక కేడర్ ను ఏర్పాటు చేసుకుంటే అండగా ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎదురైన ఘటనలు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని విస్తృత చర్చజరుగుతుంది.

Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు

హాట్ టాపిక్ గా…
పార్టీ రజతోత్సవ సభ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నారు. అందుకు పార్టీ నేతలంతా నిమగ్నమయ్యారు. కానీ కవిత మాత్రం పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటే లక్ష్యంగా ధర్నాకు దిగుతుంది. దీంతో ఈ సమయంలో ఆమె ధర్నా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సభ విజయవంతంపై దృష్టిసారించకుండా ధర్నాపైనే ఫోకస్ పెట్టడంపై ఎమిటని పలువురు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా కవిత ఇందిరా పార్కు ధర్నా సర్వత్రా ఆసక్తితో పాటు చర్చకు దారితీసింది.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?