Licensed Surveyors (imagecredit:twitter)
తెలంగాణ

Licensed Surveyors: త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం.. సమస్యలు తీరేనా!

Licensed Surveyors: భూ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో లైసెన్సడ్ సర్వేయర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఆసక్తి కలగిన అభ్యర్థుల వద్ద దరఖాస్తులు స్వీకరించి శిక్షణ ఇవ్వనున్నారు. మే 26 నుంచి జులై 26 వరకు 50 రోజుల పాటు తెలంగాణ రీమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(Telangana Remote Sensing Application Center) సహకారంతో శిక్షణ ఇస్తున్నారు. దీంతో రెవెన్యూ(Revenue) రికార్డులు పూర్తిగా డిజిటలైజేషన్ గా మార్చానున్నారు. సర్వే రికార్డులు సైతం డిజిటల్ మాడ్యూల్ లో పొందుపర్చానున్నారు. డిజిటల్ మ్యాప్లు సిద్దమైతే ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో సులభంగా చూసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో సాధారణ విధానం కన్న వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్థిష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు.

పారాదర్శకంగా ప్రభుత్వ సేవలు

డిజిటల్ మ్యాపింగ్ విధానంతో భూ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు రైతులకు, లబ్ధిదారులకు అందనున్నాయి. భూమి యొక్క హద్దులు, రికార్డులకు అనుగుణంగా పరిమాణం, అకృతి ఫిక్స్ చేయనున్నారు. మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగనుంది. డిజిటల్ మ్యాప్(Digital Map) ను భద్రపర్చడంతో పాటు కాలనుగుణంగా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Also Read: Banakacherla project: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్?

సర్వేయర్ల శిక్షణ ఇలా

సర్వేయర్లు భూమి యొక్క కొలతలు, సరిహద్దులను గుర్తిస్తారు. అలాగే భవనాలు, ఇతర నిర్మాణాలు వంటి వాటిని సైతం కొలుస్తారు. భూమిని కొలవడం, మ్యాప్‌లు, ప్లాన్‌లను సిద్ధం చేయడం, సరిహద్దు వివాదాలను పరిష్కరించడం, భవనాలు, ఇతర నిర్మాణాలను కొలవడం, నిర్మాణ ప్రణాళికలకు సహాయం, పరిరక్షణ ప్రాజెక్టులకు సహాయం ఏ విధంగా చేయాలనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. టోటల్ స్టేషన్, లెవెల్, జీపీఎస్(GPS), టేపులు, డ్రోన్లు(Drons) వంటి పనిముట్లు ఉపయోగిస్తారు.

డిజిటలైజషన్ కోసం లైసెన్సడ్ సర్వేయర్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే లైసెన్సడ్ సర్వేయర్లు తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం కానుంది. రంగారెడ్డిలో 400, వికారాబాద్లో 150, మేడ్చల్ లో 120 మంది చొప్పున సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచే జిల్లాలకు అవసరమైన లైసెన్సడ్ సర్వేయర్ల నియామకం జరగనుంది. అయితే రంగారెడ్డిలో 27, వికారాబాద్లో 20, మేడ్చల్లో 15 మండలాలకు అవసరమైన వారిని చేర్చుకుంటారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలను బట్టి మండలానికి 4 నుంచి ఆరుగురిని నియమించుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డిలో 108, వికారాబాద్లో 80, మేడ్చల్ లో 60 మంది చొప్పున నియామకం చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక పరిస్థితి సర్వే డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయస్తారు… తక్కువలో తక్కువగా ధర రూ2500 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?