Banakacherla project: బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘాటుగా స్పందించారు. గోదావరి, కృష్ణాజలాల్లో తెలంగాణ(Telangana)కు వాటా వచ్చేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గిలేదని తేల్చిచెప్పారు. సెంటిమెంట్ రగుల్చేందుకు కొందరు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టు
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంపై జూలై 16న కేంద్రజలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్ సారధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)లతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో 6 అంశాలను చర్చించారు. అందులో బనకచర్ల ప్రాజెక్టు అంశం చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒప్పుకునేది లేదని, అవసరం అయితే పోరాటం చేస్తామని వెల్లడించారు. కొద్దిరోజులుగా బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చలేదు. ఇంతటితో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగదని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు మళ్లీ ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి మళ్లీ మొదలైంది. రాష్ట్రంలోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది కూడా హాట్ టాపిక్ అయింది.
రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగుర వేసిన సీఎం చంద్రబాబు(Chandra babu) నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ(Rayalasema)ను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించామని, సముద్రంలోకి వృధాగాపోయే నీటినే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని, ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు? అని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ, వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది? అని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని తేల్చిచెప్పారు.
Also Read: Hyderabad District Collector: రుణాల మంజూరులో బ్యాంకులు ముందుండాలి: కలెక్టర్ హరిచందన
వ్యూహాత్మక ప్రణాళికతో పని
దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పాడబోమన్నారు. నాటి నుంచి సాగు, తాగునీరు ఎవరి ఒత్తిళ్లకు లొగ్గేది లేదని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తామన్నారు. దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని పిలుపు నిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి గోదావరి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు పోతామన్నారు. విష ప్రచారం చేస్తే తిప్పికొట్టాలన్నారు. ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై ఎలాంటి విధానాన్ని అనుసరించబోతుంది? ఏపీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చేస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాను కేంద్రం తేల్చలేదు. అంతేకాదు గోదావరి, కృష్ణాబోర్డు కార్యాలయాలను చేరు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కేంద్రం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీకి మార్గం శాశ్వత ముగింపు చూపడం లేదు. దీంతో రాబోయే కాలంలో ఈ నీటి పంచాయతీ ఎటు దారితీస్తుందోనని ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ బనకచర్ల ప్రాజెక్టు అంశం ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అస్త్రాలతో ముందుకు సాగుతారు? ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారు? కేంద్రంపై ఎలా పోరాటం చేస్తారనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ దూకుడుపెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను ఏపీకి అప్పగిస్తున్నారని, శిష్యుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు చేస్తుంది.
Also Read; Coolie OTT: రజినీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?