మెదక్ బ్యూరో: TG Speaker Gaddam Prasad Kumar: స్వేచ్ఛ: దేశంలోనే నిషేధించబడ్డ, కొనొకార్పాస్ చెట్ల (విషతుల్యం) మొక్కలను గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో హరిత హారంలో భాగంగా నాటారు. అవి పెద్దవై కొన్ని చోట్ల వృక్షాలుగా మారి ప్రజల ఆరోగ్యంపై విషం చిమ్ముతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో పాలక, ప్రతిపక్షం సభ్యుల మధ్య ఆసక్తి కర చర్చ జరిగింది. తెలంగాణలో 7 శాతం అడవిని అభివృద్ధి చెందేందుకు,హరిత హారం నిర్వహించామని బీఅర్ఎస్ నేతలు ప్రస్తావించగా దేశంలో నిషేధించిన కోనో కార్పాస్ చెట్ల మొక్కలు నాటి ప్రజల ఆరోగ్యంపై పై విషం కక్కుతున్న వాటిని తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో విషతుల్యం వెదజల్లే మొక్కలు, చెట్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజక వర్గాల్లో 11 లక్షల మొక్కలు అధికారుల ఆధ్వర్యంలో వివిధ శాఖల ద్వారా నాటారు. అవి పెద్దవై కొన్ని వృక్షాలుగా మారి ప్రజల ఆరోగ్యంపై విషం కక్కుతున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మున్సిపాలిటీల్లో అదనంగా ఈ మొక్కలను పెంచడం జరిగింది. మొత్తం 15 లక్షల వరకు మొక్కలు, కోట్ల రూపాయలతో హరిత హారంలో నాటారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలలో అడుగడుగునా ఈ చెట్ల దర్శనమిస్తాయి. హరిత హారం పేరిట నాటిన, కొనో కార్పస్ మనుషుల ప్రాణాలు హరించేదిగా తేలడంతో ప్రభుత్వమే వాటిని తొలగించేందుకు సిద్దమవుతుంది.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లు రగడ.. కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ
కోనో కార్పస్ చెట్లు ప్రజల ఆరోగ్యంపై విషం చిమ్మడమే కాకుండా పర్యావరణానికి, స్థానిక జీవవైవిధ్యానికి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిందని పరిశోధించిన శాతవాహన యూనివర్శిటీ బాటని ప్రొఫెసర్ నరసింహ మూర్తి తన పరిశోధనలో తేలింది. కొనో కార్పస్ చెట్లు, ఆరోగ్యానికి సమస్యల కారణమవుతుందని, దీంతో పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ చెట్లను, మొక్కలను నిషేధించారు. ప్రజల ఉసురు తీసే ఈ మొక్కలను తొలగించాలని అసెంబ్లీ వేదికగా స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించడంతో ఇది అమలు కానుంది.
చెట్ల తొలగింపుకు సైతం కొట్లు ఖర్చు అయ్యే పరిస్థితులు దాపురించాయి. దేశంలో నిషేధించిన మొక్కలను, చెట్లను తెలంగాణలో నాటడం వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చ జరగడంతో తెలంగాణ ప్రజల దృష్టి, కొనో కార్పస్ చెట్లు, మొక్కలపై పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్జి నియోజక వర్గాల్లో లక్ష చొప్పున కొనో కార్పస్ మొక్కలను నాటారు. ఇవి కాకుండా, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మున్సిపాలిటీల్లో లక్షన్నర చొప్పున మొక్కలను నాటారు.
ఇవి తడి లేకుండానే మొక్కలు పెరుగుతాయని తెలుస్తోంది. ఐనప్పటికీ ఈ మొక్కల పెంపకంపై ప్రభుత్వం కొట్లు ఖర్చు చేసింది. ఇదిలా వుండగా ఇప్పుడు ఈ మొక్కలను తీసి వేయడానికి అంతే ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో బీఅర్ఎస్ ప్రభుత్వం నాటిన కోనో కార్పస్ చెట్లు విషం చిమ్ముతున్నాయి. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే విషం చెట్లను బీఅర్ఎస్ ప్రభుత్వం నాటింది. వీటిని తొలగించాలని వీటిని తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో హరిత హారంలో భాగంగా జిల్లా కేంద్రాలు మొదలుకొని, మున్సిపాలిటీ లు గ్రామపంచాయితీల వరకు ఈ కొనో కార్పస్ చెట్లు నాటారు. ఇవి ప్రజల ఆరోగ్యంపై విషం కక్కుతున్నాయి.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రతిరోజూ పండగే…!