హుజూర్ నగర్ స్వేచ్ఛ: Waqf Amendment Bill: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలంటూ హుజూర్ నగర్ పట్టణంలో పలువురు ముస్లింలు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఉస్మానియా మస్జిద్ నుండి ఇందిరాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉస్మానియా మస్జిద్ ముఫ్టి మహమ్మద్ గౌస్ ఉద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024లో తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని మేధావులు అన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముస్లిం మైనార్టీ నాయకులు మరియు ముస్లిం పెద్దలు ముస్లిం యువకులు ఎత్తున పాల్గొన్నారు.
Also Read: TG Power Generation Plants: తెలంగాణ సరికొత్త రికార్డ్.. ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి