తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : TG Power Generation: Plants: ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పతి ప్లాంట్ల ఏర్పాటుతో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో హిమాచల్ ప్రదేశ్ లో 2 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాన్ని చేసుకున్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ తో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భద్రతను పెంచుకునే అంశానికి కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
Also Read: Ganja Seized: గంజాయి కలకలం.. 15 కేజీలు పట్టివేత.. ఎక్కడంటే?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదిత ప్రాజెక్టులు సెలి(400 మెగావాట్లు), మియార్(120 మెగావాట్లు) స్వచ్ఛమైన, ఆర్థికంగా మేలైన, విశ్వసనీయమైన విద్యుత్తును అందించడంలో ఉపకరిస్తాయని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. గ్రీన్ పవర్. థర్మల్ పవర్ తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని, అంతేకాకుండా థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండగా హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తుందని వివరించారు.
Also Read : Telangana Police: అయ్యబాబోయ్.. 70వేల మొబైల్ ఫోన్ల రికవరీ.. ఎలా చేశారంటే?
హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో నిండి ఉన్న రాష్ట్రం కావడంతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు నిరంతరం హైడల్ పవర్ ఉత్పత్తికి అనువుగా ఉంటుందని తెలిపారు. హిమాచల్ తో పోలిస్తే దక్షిణ భారతదేశ నదులపై హైడల్ విద్యుత్ ఉత్పత్తి కాలం పరిమితంగా ఉంటుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ సహజ వనరులను వినియోగించుకుని తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు, నమ్మకమైన, పర్యావరణ హిత విద్యుత్ ను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ ఒప్పందం ముందుకు తీసుకెళుతుందని వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టులను తెలంగాణ జెన్కో నామినేషన్ విధానంలో చేపట్టనుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ పవర్ వాటాను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ఒప్పందం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పాటును అందించడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయపడుతుందని తెలిపారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు కీలక నిందితుడు!
ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేశ్ ప్రజాపతి, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు