Ganja Seized [ image credit twitter]
తెలంగాణ

Ganja Seized: గంజాయి కలకలం.. 15 కేజీలు పట్టివేత.. ఎక్కడంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ganja Seized: విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించిన ఎక్సయిజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ బృందాలు నిందితులను అరెస్ట్​ చేసి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ వీ.బీ.కమలాసన్​ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్​ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసి స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ ఏ టీం సీఐ నంధ్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన సిబ్బంది మహ్మద్​ చాంద్​, మహ్మద్​ రియాజ్​ లను అరెస్ట్​ చేశారు.

Also Read: SLBC Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక పురోగతి.. పెద్ద సమస్య తీరినట్లే!

వీరి నుంచి 2.8 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి శంషాబాద్ ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు. ఇక, శేరిలింగంపల్లి, చందానగర్​ ప్రాంతాల్లో కొందరు గంజాయి అమ్మటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసి సీఐ నంధ్కాల అంజిరెడ్డి, ఎస్సై బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేశారు. మహారాష్ర్ట నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయించటానికి యత్నించిన దుర్గప్రసాద్​, అయూబ్​, మాధవన్, సిద్దిఖీ, ఇష్రాన్​, నవీన్​ కుమార్​ లను అరెస్ట్​ చేసి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Fine Rice Distribution: ఉగాది నాడు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి డివిజన్​ అసిస్టెంట్​ కమిషనర్​ ఆర్​.కిషన్​ నేతృత్వంలో సిబ్బంది సరూర్​ నగర్​ ప్రాంతంలో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసి ఒక కిలో గంజాయిని సీజ్ చేశారు. ఇక, ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ అధికారులు, రైల్వే పోలీసులు కలిసి శనివారం సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీ సీటు కింద దాచి పెట్టి ఉన్న 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ గంజాయిని దాచి పెట్టింది ఎవరన్నది తెలియరాలేదు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?