SLBC Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక పురోగతి.. పెద్ద సమస్య తీరినట్లే!
SLBC Tunnel Rescue Operations(Image credit twitter)
Telangana News

SLBC Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక పురోగతి.. పెద్ద సమస్య తీరినట్లే!

SLBC Tunnel Rescue Operations: 36 రోజులుగా నిర్విరామంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లో ఈ రోజు కీలక పురోగతి లభించింది. టన్నెల్‌లో సహాయక చర్యలు రెట్టింపు వేగంతో కొనసాగుతున్నాయి. ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న లోకో ఇంజిన్‌ను సహాయక బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తూ, సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నాయి. శనివారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల ప్రగతిని సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి. గతంలో వెలికితీసిన లోకో ఇంజిన్‌ను ఆధారంగా చేసుకుని, ఇప్పుడు ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న కార్మికుల రక్షణపై మరింత దృష్టి సారించారు. మట్టి తొలగింపు, స్టీల్ నిర్మాణాల తొలగింపు, నీటి వ్యర్థాల తొలగింపు వంటి ముఖ్యమైన పనులు ప్రగతిలో ఉన్నాయి. సహాయక బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ, చిక్కుకున్న వారిని క్షేమంగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ రోజు జరిగిన సహాయక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్మీ అధికారి వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జిఎస్‌ఐ అధికారి పంకజ్ తిరుగున్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు విజయ్, అక్షయ్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి నేతృత్వంలో నిర్వహించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త కొలువులకు వేళాయేరా?

ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ.. గత సహాయక చర్యల విజయాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మట్టి తొలగింపు, లోపలికి మాకు అడ్డుగా ఉన్న రక్షణ గోడలను తొలగించడం, అలాగే ప్రమాద ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించడం ప్రాధాన్యతతో చేపడుతున్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రతిరోజూ ప్రగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 12 ప్రత్యేక సహాయక బృందాలు సమన్వయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సహాయ చర్యలు వేగవంతం చేయాలని ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. సహాయక బృందాలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

టన్నెల్‌లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపించే ప్రక్రియ, మట్టిని తొలగించే పనులు, స్టీల్ నిర్మాణాలను తొలగించే చర్యలు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు. నాలుగు ఎక్స్‌కవేటర్లు, రెండు బాబ్ క్యాట్‌లు మట్టిని నిరంతరాయంగా తొలగిస్తూ, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రక్రియలతో పాటు వెంటిలేషన్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ రోజు ఉదయం నుంచి మరింత మంది నిపుణులను రంగంలోకి దింపి, రెట్టింపు బలంతో సహాయక చర్యలను వేగవంతం చేశామన్నారు. ప్రత్యేక డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించి లోపలి ప్రదేశాలను సులభంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నామని తెలిపారు.

సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలని, ప్రాణనష్టం లేకుండా రక్షణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు శివశంకర్ లోతేటి సూచించారు. ప్రభుత్వ సహకారంతో సహాయక బృందాలు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయని, త్వరలోనే మరింత ప్రగతి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..