TPCC Mahesh Kumar Goud: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై ప్రస్తుతం యావత్ దేశం చర్చ జరుగుతోంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలకు కులగణన జోడించనున్నట్లు కేంద్రం (Central Govt) సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఒత్తిడి నేపథ్యంలోనే కేంద్రం తలొగ్గిందని అన్నారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
స్వతంత్ర భారతావనిలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించినట్లు చెప్పారు. బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దానిని గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపిన విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ మంత్రులతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma)
ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు.
ఆ క్రెడిట్ రాహుల్ దే
తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించడం వెనక రాహుల్ ప్రోద్భలం ఎంతో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీకే చెందుతుందని స్పష్టం చేశారు. కేంద్రం జనగణన తో పాటు కులగణన చేయాలని సంకల్పించడం.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని అన్నారు. తెలంగాణ మోడల్ ను కేంద్రంలోని బీజేపీ అను సరిస్తోందని పేర్కొన్నారు. కుల గణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్ (Rahul Gandhi) ఆశయం నెరవేరిందని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Also Read: Amaravati Relaunch: కాసేపట్లో అమరావతి సభ.. ఏర్పాట్లలో గందరగోళం.. ప్రజలు ఫైర్!
ఆత్మ విమర్శ చేసుకోండి
మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం కులగణన అంశంపై రాజ్ భవన్ (Raj Bhavan) వద్ద మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. గతంలో కులగణనను విమర్శించిన రాష్ట్ర బీజేపీ నాయకులు.. కేంద్రం తాజా నిర్ణయంతో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వం గా తీసుకుంటే వారు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నట్లు ఆరోపించారు.