Restrictions On TG Secretariat: సచివాలయంలో​ అత్యుత్సాహం!
Restrictions On TG Secretariat(IMAGE credit: twitter)
Telangana News

Restrictions On TG Secretariat: సచివాలయంలో సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం!

Restrictions On TG Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో ఆంక్షలు అధికారులు, ప్రజలకు షాకిస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్‌లో సెక్యూరిటీ స్టాఫ్​ విధిస్తున్న స్పెషల్ నిబంధనలతో పబ్లిక్‌తో పాటు అధికారులు పరేషాన్ అవుతున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం (Deputy CM) ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు స్వయంగా అధికారులే చెప్తున్నారు. ఆ ఛాంబర్ ముందు నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని తేల్చి చెప్తున్నారు.

 Also Read: Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!

సాధారణంగా డిప్యూటీ సీఎం (Deputy CM) తన ఛాంబర్‌లో ఉంటే, సెక్యూరిటీ కారణాలతో పంపించడం లేదని భావించవచ్చు. కానీ ఆయన లేకపోయినా, ఆ ఎంట్రన్స్ వద్ద నుంచి ప్రజలు, అధికారులను పంపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ఛాంబర్ వైపు నుంచి ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని అధికారులే వాపోతున్నారు. స్టాఫ్​ ఐడీ కార్డులు చూపించినా అనుమతించకపోవడం లేదని వారు అంటున్నారు. పైగా, తమకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయంటూ చెక్ పాయింట్ వద్ద ఉన్న స్టాఫ్​ సమాధానం ఇస్తున్నారట. సెక్రటేరియట్‌లోని సీఎం ఛాంబర్ ఉన్న ఆరవ ఫ్లోర్‌లో కూడా ఈ తరహాలో వ్యవహరించడం లేదని ఓ ఉన్నతాధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రన్స్ వద్ద స్టాఫ్​ చేసే అత్యుత్సాహం వలన డిప్యూటీ సీఎంకు చెడ్డపేరు వస్తున్నదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Also Read:Swetcha Effect: భూకబ్జాదారులను వదిలేదే లేదు.. ప్రభుత్వ భూములను కాపాడుతాం!

గుర్తు పట్టడంలో ఫెయిల్

కొంత మంది ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులనూ సెక్యూరిటీ స్టాఫ్​ గుర్తు పట్ట లేక పోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం (Deputy CM) ఎంట్రన్స్ వద్ద ఓ ఐఏఎస్ అధికారితో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకూ ఇలాంటి అనుభవం ఎదురైనట్లు సమాచారం. చివరకు ఓ సీఐ గుర్తుపట్టి లోపలికి పంపించినట్లు తెలిసింది. ప్రతీ రోజు కొత్త స్టాఫ్‌కు డ్యూటీలు వేయడం వలన ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఇక, డిప్యూటీ సీఎంను కలిసేందుకు, వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చే సాధారణ ప్రజలు లోపలికి వెళ్లాలంటే గగనంగా మారింది. కొందరు సెక్యూరిటీ స్టాఫ్​ దురుసుగా మాట్లాడుతున్నట్లు స్వయంగా మధిర నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి చెప్పారు.

ఇక్కడే కాకుండా కొంత మంది మంత్రుల పేషీల్లో ఉండే సెక్యూరిటీ స్టాఫ్​ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ మంత్రి పేషీలో కార్పొరేషన్ చైర్మన్లను కూడా గుర్తు పట్టకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. తమకు ప్రోటోకాల్ విషయంలో సమస్యలు వస్తున్నాయని ఇటీవల కొందరు కార్పొరేషన్ చైర్మన్లు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె చైర్మన్లకు హామీ ఇచ్చారు.

 Also Read: Heavy Rainfall Alert: మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..