Tummala Nageswara Rao: తెలంగాణ వ్యవసాయ రంగానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దిక్చూచిలా నిలిచిందని, ఇది డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సమ్మిట్‌లో భాగంగా ఆర్ఏఆర్ఈ (రూరల్ అగ్రికల్చర్ రిజీయన్ ఎకనామి)లో జరిగిన ‘ఇన్ క్రిజింగ్ ఫార్మర్స్ ఇన్ కం త్రో వాల్యూ చైన్స్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతులు తెలంగాణకు వెన్నెముక వంటివారని, వ్యవసాయం రాష్ట్ర జనాభాలో ఎక్కువ మందికి జీవనోపాధికి ప్రధాన వనరుగా కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, గత రెండేళ్లలో ఉచిత విద్యుత్తు, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ఇది రైతు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారు 34.6 బిలియన్లుగా ఉందని మంత్రి వివరించారు. దీనిని 2047 నాటికి 400 బిలియన్లకు పెంచడం తమ ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని అన్నారు.
Also Read: Seethakka: మా ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్రబిందువుగా చేసుకుని పని చేస్తోంది : మంత్రి సీతక్క
తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం..
రైతు భరోసా, పంట-భీమా మద్దతు, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతులు తమ ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయని మంత్రి అన్నారు. పొలం నుంచి మార్కెట్ వరకు బలమైన విలువ గొలుసులను నిర్మించడం, వృధాను తగ్గించడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం, ప్రతి రైతు ఆధునిక సాంకేతికత ఆధారిత వ్యవసాయం నుంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అంతకు ముందు వ్యవసాయ, ఉద్యాన, టెక్స్‌టైల్స్ స్టాల్స్‌ను ప్రారంభించిన మంత్రి, గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగం చోదక శక్తిగా మారేలా ఈ గ్లోబల్ సమ్మిట్‌లో శాఖాపరమైన ఏర్పాట్లు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.
Also Read: International Zoo Project: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్ ఏర్పాటు.. ఈ నెల చివరణ..!

