International Zoo Project: అంతర్జాతీయ స్థాయి జూ పార్క్ ఏర్పాటు
International Zoo Project (imagecredit:swetcha)
Telangana News

International Zoo Project: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్ ఏర్పాటు.. ఈ నెల చివరణ..!

International Zoo Project: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాటు చేసింది. అయితే ఈ సమ్మిట్ లో కీలక ఒప్పందంను ప్రభుత్వం చేసుకుంది. ఈ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా జూ ఏర్పాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మరో సారథ్యమైన అడుగు వేసింది. రాబోయే కొత్త జూ రూపకల్పన, సాంకేతిక సూచనలు, అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై మార్గదర్శకత్వం అందించే దిశగా ముఖేష్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన వంతరా జూ నిర్వాహకులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. వంతరా జూ ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాసం, శాస్త్రీయ నిర్వహణలో ప్రసిద్ధిపొందిన సంస్థ. అక్కడ అమలు చేస్తున్న వివిధ నమూనాలను తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జూ కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదిరింది.

పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్యం

ఈ ఎంఓయూలో 5 కీలక అంశాలు ఉన్నాయి. వంతరా జూ నిర్వహణలో అమలవుతున్న జంతు సంరక్షణ, పునరావాస చర్యలపై సాంకేతిక సహాయం, నైట్ సఫారీ రూపకల్పన, నిర్వహణ నమూనాలు, భద్రతా ప్రమాణాలు, ఫారెస్ట్-బేస్డ్ ఎకో థీమ్ పార్క్ అభివృద్ధికి సాంకేతిక సలహాలు, పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో జూ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు, ఆధునిక ఎంక్లోజర్లు, వన్యప్రాణి సంక్షేమ ప్రమాణాలు, సందర్శకుల అనుభవం మెరుగుపరిచే ఉత్తమ పద్ధతులపై సహకారం. ఈ అవగాహన ఒప్పందంతో తెలంగాణలో ఏర్పడబోయే కొత్త జూ దేశంలోనే కాక ఆసియా స్థాయిలో ఒక ప్రత్యేక ఆకర్షణ, అంతర్జాతీయ మోడల్ జూగా అభివృద్ధి చెందే అవకాశాలు మరింత బలపడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సి సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ సునీత భగవత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also read: Kavitha: పంచాయతీ ఎన్నికల రోజూ ఏపీపీ పరీక్షనా? వాయిదా వేయాలని ఎక్స్‌లో కవిత డిమాండ్!

ఈ నెల చివరలో వంతరాను సందర్శిస్తా

ఈ నెల చివరలో వంతరాను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో సీఎంను వంతరా బృందం కలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జంతువులకు వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ జూ పార్కులో ఉండలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జంతువుల సేవ అనే నినాదంతో వంతారా పనిచేస్తుంది.. ఇది నిజంగా అభినందనీయం అన్నారు.

Also Read: YS Sharmila: కర్త మోదీ.. కర్మ చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై షర్మిల విమర్శనాస్త్రాలు

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?