TG BRAP 2024: సంస్కరణలతో అభివృద్ధితో తెలంగాణ(Telangana) ముందుకు సాగుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రీఫార్మ్స్(Ease of Doing Business Reforms) (బీఆర్ఏపీ-2024)లో “టాప్ అచీవర్” గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందినది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), భారత ప్రభుత్వం- రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను బలోపేతం చేయడానికి బ్యూజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ) 2024 అనే 7వ ఎడిషన్‌ను ప్రారంభించింది. వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి విస్తృతమైన సంప్రదింపులు, వాటాదారుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన బీఆర్ఏపీ-2024లో 434 రీఫార్మ్ పాయింట్లు ఉన్నాయి. ఇవి కార్మిక చట్టాలు, భూసంస్కరణ పరిపాలన, ఆస్తి రిజిస్ట్రేషన్, పెట్టుబడి సౌకర్యాలు, పర్యావరణ అనుమతుల వంటి కీలక అంశాలున్నాయి.
Also Read: Hyderabad Alert: ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో.. హైదరాబాద్ లో హై అలర్ట్
బీఆర్ఏపీ 2024లో..
బీఆర్ఏపీ- 2024 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాన సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడమే కాకుండా, 13 శాఖల్లో 1,467 కాంప్లయెన్స్‌లను తగ్గించింది. దీంతో సమర్థవంతమైన పరిపాలన, పారదర్శకత, వ్యాపారానుకూల వాతావరణంపై రాష్ట్రం నిబద్దత మరోసారి వెల్లడైంది. ఈ విశిష్ట ప్రదర్శనకు గుర్తింపుగా, తెలంగాణ రాష్ట్రం బీఆర్ఏపీ 2024లో నాలుగు ప్రధాన విభాగాల్లో “టాప్ అచీవర్” గౌరవాన్ని సాధించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో టాప్ అచీవర్ అవార్డును అందుకున్నారు. బిజినెస్ ఎంట్రీ, కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో సాధించిన ప్రగతికి అవార్డు అందుకున్నట్లు తెలిపారు.
