]Kavitha: బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టావిప్పుతా
Kavitha ( image credit: swetcha reporter)
Telangana News

Kavitha: బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టావిప్పుతా.. కవిత కీలక వ్యాఖ్యలు!

Kavitha: కాంగ్రెస్తో అంట తాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జస్ట్ ఇది టాస్క్ మాత్రమేనని.. టెస్ట్ మ్యాచ్ ముందు ఉందన్నారు. ఇకపై తాను సైలంట్‌‌గా ఉండేది లేదని స్పష్టం చేశారు. తన జోలికి వస్తే బీఆర్ఎస్ నేతల స్పష్టం చేశారుఅవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు హెచ్చరించారు. మిగిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్త అని హెచ్చరించారు. కెసిఆర్ తో పాటు ఎవరినైనా ఒక పనైనా అడిగామా? దమ్ముంటే నా ఆరోపణలు సమాధానం ఇవ్వాలని.. నాకు ఎవరితోనూ అవగాహన లేదు.. వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాదులోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. టీ న్యూస్ కు లీగల్ నోటీస్ పంపుతున్నట్లు తెలిపారు.

వారికి లీగల్ నోటీసులు

వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. దేవుడి దయతో భవిష్యత్‌లో తాను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై విచారణ చేపడతానన్నారు. 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుందని.. తనకూ ఎప్పుడో ఒకసారి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీ న్యూస్ ఏమైనా సోషల్ మీడియా అనుకున్నారా? లేక శాటిలైట్ ఛానెల్ అనుకున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.

Also Read: Kavitha: రూ.2500, గ్యాస్ ఫ్రీ హామీలు ఎక్కడ? వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ? : కవిత

తన భర్త మీ వద్దకు వచ్చారా?

అసలు ఆ విషయం గుర్తుందా? అంటూ ఆ ఛానెల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేస్తే.. చెక్ చేసుకోవాలా, లేదా? అంటూ ఆ మీడియాను సూటిగా నిలదీశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనతోపాటు తన భర్తపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని తాము దోచుకోలేదన్నారు. గత పదేళ్లలో ఎప్పుడైనా సాయం కోసం తన భర్త మీ వద్దకు వచ్చారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి.. వాటిని తనపై వేయాలను కోవడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే తాటా తీస్తానంటూ హెచ్చరించారు .

శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కేటీఆర్ వద్ద ఉంటాం

ఏవి రెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి భూ లావాదేవీలు ఉన్నాయని.. శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కేటీఆర్ వద్ద ఉంటారని ఆయన ఎవరి బీనామో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి అని ఓ గుంటనక్క ఆయన వెనుక ఉండి ఆడిస్తుందని.. మాధవరం బాధితులు చాలామంది తనకు ఫోన్ చేస్తున్నారని.. ప్రణీత్ ప్రాణవ ప్రణీత్, ప్రాణవ్ కంపెనీలో కంపెనీలో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్ అని.. ఆ కంపెనీల విల్లలు అన్ని కబ్జాలో కట్టినవేనని.. వెంచర్ మధ్యలోనే 10 ఎకరాల చెరువు ఆరు ఎకరాలకు ఎలా తగ్గిందని.. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ చెరువు సంగతి చూడాలని కోరారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారని ఆరోపించారు.

Also Read: BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు