Telangana Bandh (Image Source: Twitter)
తెలంగాణ

Telangana Bandh: రేపే రాష్ట్ర బంద్.. రంగంలోకి కవిత.. జాగృతి తరపున కీలక ప్రకటన

Telangana Bandh: స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42 రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్ట్ స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ రాష్ట్రంలోని బీసీ సంఘాలు రేపు (అక్టోబర్ 18) రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుతూ.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు, నేతలను బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య.. కవితకు లేఖ రాశారు. దీనిపై ఆమె స్పందిస్తూ జాగృతి తరపున బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు.

కవిత ఏమన్నారంటే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న జరగనున్న రాష్ట్రవ్యాప్త బంద్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అర్హత లేదని ఆమె విమర్శించారు. ‘తెలంగాణ చట్టసభలు పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా?. అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామంటోంది. రెండు జాతీయ పార్టీలు బీసీ లను వంచిస్తున్నాయి’ అని కవిత మండిపడ్డారు.

కవితకు ఆర్. కృష్ణయ్య లేఖ

అంతకుముందు బంద్ కు కవిత మద్దతు కోరుతూ ఆర్. కృష్ణయ్య లేఖ రాశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు అన్ని ఏకమై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 18న బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుమీద బంద్ జరపాలని నిర్ణయించాం. ఇప్పటికే మీరు బీసీ రిజర్వేషన్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండటం సంతోషకరం. కావున తెలంగాణ జాగృతి కూడా బంద్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ కవితకు బీసీ జేఏసీ నేత ఆర్. కృష్ణయ్య లేఖ రాశారు.

Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. ఇంటి ఓనర్ ఏం చేశాడో చూడండి!

ఛలో రాజభవన్ కు పిలుపు

మరోవైపు బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా సీపీఎం నేతలు ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ అడ్డుకుంటున్న తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి అడ్డుకున్నారని.. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఇటీవల జీవో 9పై హైకోర్టు స్టే సైతం విధించిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని రకాలుగా కేంద్రం అడ్డుపడుతోందని జాన్ వెస్లీ మండిపడ్డారు. గవర్నర్ పోస్ట్ మాన్ లా కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడే వ్యక్తిగా వ్యవహరించాలని హితవు పలికారు.

Also Read: Wife Kills Husband: ప్రియుడితో ఎఫైర్.. భర్తను కడతేర్చిన భార్య.. చీరతో గొంతు బిగించి మరి హత్య

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?