Telangana Jagruthi: గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసి ఆస్తులు కూడగట్టుకోవటానికి ఆయన అక్రమాలు, దందాలు చేశారని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్ ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha)పై చేస్తున్న అనుచితవ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎస్పీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, తప్పుల నుంచి బయట పడేందుకే తన పదవికి రాజీనామా చేశాడని ఆరోపించారు.
మాయావతి కాళ్లు పట్టుకొని..
మాయావతి కాళ్లు పట్టుకొని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని, పార్టీకి గుర్తింపు తెస్తాడని నమ్మి మాయావతి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారన్నారు. అధ్యక్షుడు అయ్యాక బీఆర్ఎస్ ను నోటికొచ్చినట్లు విమర్శించాడని, కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ లోనే చేరి బీఎస్పీని నట్టేట ముంచాడని మండిపడ్డారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను కవిత చదవే ఆ ఖర్మ పట్టలేదని, ఆమె తెలంగాణ కోసం 20 ఏళ్లు పోరాటం చేసిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ఆమె చేసిన కృషి తెలంగాణ ప్రజల ముందుందన్నారు. ప్రజలలో కవిత కి వస్తున్న ఆదరణ చూడలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ప్రాపకం కోసం మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జాగృతి నాయకుడు కామెర నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్పీ ఏ వర్గం నుంచి వచ్చారో ఆ వర్గం బిడ్డలను ఎన్ కౌంటర్లు చేసి వాళ్ల రక్తం కళ్లచూసిండన్నారు.
Also Read: Republic Day 2026:: మేడ్చల్ పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!
నీకు పుట్టగతులు లేకుండా పోయాయి
రాజకీయ అవసరాల కోసం బీఎస్పీ(BSP)ని వదిలి బీఆర్ఎస్(BRS) లో చేరిన వ్యక్తి ఆర్ఎస్పీ అన్నారు. ఖబడ్దార్ ఆర్ఎస్పీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మీరు మాట్లాడేది తెలంగాణ ఉద్యమకారురాలి మీద అన్న విషయం మర్చిపోకండి.. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి అనే గొప్ప రాజకీయ వేదికను కవిత గారు ఏర్పాటు చేయబోతున్నారు. రాజకీయ అవసరాల కోసం గతంలో బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.. రేపు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో మాత్రం నీకు పుట్టగతులు లేకుండా పోయాయన్నది వాస్తవం అని జోస్యం చెప్పారు. ఐపీఎస్ గా చేసిన అక్రమాల నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశావ్ అని మండిపడ్డారు. మరొకసారి కవితపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే మాత్రం జాగృతి ఊరుకోదని హెచ్చరించారు. సమావేశంలో జాగృతి సీనియర్ నాయకులు కోళ్ల శ్రీనివాస్, ఎత్తరి మారయ్య, సురేందర్ జీ, డి. వీరన్న, శ్రీనివాస్ రావు, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Chevella News: చేవెళ్ల మండల పరిధిలో.. అధికారుల నిర్లక్ష్యానికి జాతీయ జెండాకు అవమానం..!

