Minister sudheer babu: వినూత్నఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ(Monash University) ప్రతినిధులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆహ్వానించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేద్దామన్నారు. ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్(Joint Research Programs), ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్‌లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ను చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకడమిక్ ఎక్స్ఛేంజ్, స్టార్టప్ ల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.
ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ..
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ(Telangana)ను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్(Global Innovation Hub’) గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ లే హై వూ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ థామ్సన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: KCR: ప్రజలను ఎలా ఆకట్టుకుందాం.. కోఆర్డినేషన్‌పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
విక్టోరియా పార్లమెంట్’ను సందర్శన
‘విక్టోరియా పార్లమెంట్’ను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వారికి వివరించారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ‘లీ తార్లామిస్’, ‘షీనా వాట్’ తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Upasana: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన.. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్!
