KCR ( image credit: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

KCR: ప్రజలను ఎలా ఆకట్టుకుందాం.. కోఆర్డినేషన్‌పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. గెలిచి సత్తాచాటాలని, గ్రేటర్ లో పట్టునిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే గెలుపుకోసం ఏం చేద్దాం.. కాంగ్రెస్ పార్టీ దూకుడు ఎలా ఎదుర్కొందాం మన దగ్గర ఉన్న అస్త్రాలు ఏం ఉన్నాయి..ప్రజలకు ఎలా చేరువ అవుదాం.. అనే అంశాలను చర్చించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ సన్నద్ధమవయ్యారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో జూబ్లీహిల్స్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ చార్జులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటి అవుతున్నారు. ఇప్పటికే వారందరికీ సమాచారం ఇచ్చారు. ఎన్నికల ప్రచార సరళి ఎలా నిర్వహించాలి.. డివిజన్లవారీగా సమావేశాలు ఎప్పుడు పెట్టాలి.. కులాలవారీగా ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనేదానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Also ReadKCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్రతి ఓటర్ ను ఎన్నిసార్లు కలువాలి

నేతలను ఎప్పటికప్పుడు ఎలా మోటివేషన్ చేయాలి. ప్రతి ఓటర్ ను ఎన్నిసార్లు కలువాలి. వారికి ఏయే అంశాలు వివరించాలి. ఎప్పుడు ఓటర్ల దగ్గరకు వెళ్లాలి అనే అంశాలను కేసీఆర్ వివరించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా నందినగర్ లో నేతలకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వార్ రూం ఏం చేయాలి? ఏయే నేతలు ఏయే డివిజన్లలో పర్యటించాలి. ఏ డివిజన్ లో ఏ కులస్తులు ఎక్కువగా ఉంటే ఆయా కులనేతతో సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వారికి ఏయే హామీలు ఇవ్వాలనేదానిపై మార్గనిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. స్టార్ క్యాంపెనర్ల జాబితాలో ఉన్న కేసీఆర్ సైతం ప్రచారానికి ఎప్పుడు రావాలనే అంశంపైనా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

నేతలకు దిశానిర్దేశం

ఇప్పటికే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై బాకీ కార్డు పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే దానిపై ఏమేరకు ప్రజలనుంచి స్పందన వచ్చిందనే వివరాలను సైతం కేసీఆర్ వివరించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే డివిజన్ల వారీగా కేసీఆర్ సర్వే చేయించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఏ నేత ఏమేరకు ప్రచారం చేస్తున్నారనే వివరాలను సైతం పీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పూర్తి సమాచారంతో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలిసింది. అదే విధంగా కేటీఆర్, హరీష్ రావులు ఎలా మానింటరింగ్ చేయాలి.. ఏయే డివిజన్ కు ఎన్నిసార్లు పర్యటనకు, కార్నర్ మీటింగ్, సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి.. మాగంటి సునీతపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై పలు సూచనలు చేయబోతున్నట్లు సమాచారం. కేసీఆర్ నేతలకు ఏం సూచనలు చేయబోతున్నారనేది ఇప్పుడు నేతల్లోనూ చర్చనీయాంశమైంది.

Also Read:KCR: కవిత లొల్లితో కేసీఆర్‌‌కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?

కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో పీడ్ బ్యాక్..  పలు అంశాలపై దిశానిర్దేశం

గులాబీ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి నివాసంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు. ఇప్పటికే డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులతో ప్రచారం చేయిస్తున్నట్లు వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ రెండేళ్లలో చేసిన అంశాలను చెబుతున్నారని, మాగంటి సునితపై విమర్శలు చేస్తున్నారని, బీజేపీ మళ్లీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని కేసీఆర్ కు వివరించారు. ఇప్పటివరకు ప్రచారంతో ఏ మేరకు వెళ్లారని, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందని కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం.

గోపీనాథ్ పై ఉన్న సానుభూతి సైతం ప్లస్ అవుతుంది

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కలిసి వస్తాయని, గోపీనాథ్ పై ఉన్న సానుభూతి సైతం ప్లస్ అవుతుందని కేటీఆర్, హరీష్ రావు వివరించినట్లు సమాచారం. ఇంకా ప్రచారంలో దూకుడు పెంచాలని, కొత్తధోరణులు అవలంభించాలని, కాంగ్రెస్ చెప్పిన తప్పిదాలను ప్రధానంగా వివరించాలని సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు ప్రజల్లో సానుభూతి ఉందని, కలిసి వస్తుందని నేతలంతా సమిష్టిగా కష్టపడితే విజయం సాధిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు వామపక్షాలు మద్దతు తెలిపినప్పటికీ మనం అదైర్యపడాల్సిన అవసరం లేదని సూచించినట్లు తెలిసింది.

Also Read: KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్