TG Inter Exams 2026: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్నాయి. 26 నుంచి సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మార్చి 18 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్ష తేదీల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న ఇవి పూర్తవనున్నాయి. ఆదివారం కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
Also Read: TG Intermediate calendar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 139 రోజులు సెలవులు.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన
వారం రోజుల ముందే ఇంటర్ పరీక్షలు
ప్రతిరోజు రెండు సెషన్లలో అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ ను వచ్చే ఏడాది జనవరి 21న , సెకండియర్ విద్యార్థులకు 22న నిర్వహించనున్నారు. జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా గతంతో పోలిస్తే ఈసారి వారం రోజుల ముందే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఐఐటీ, ఈఏపీసెట్, నీట్ వంటి పరీక్షలకు ఇబ్బంది కాకుండా ముందుగానే బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నేటి నుంచి ఫీజు చెల్లింపులకు చాన్స్
ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబర్ 1 నుంచి ప్రారంభంకానుంది. 14వ తేదీ వరకు గడువు విధించారు. కాగా రూ. 100 ఆలస్య రుసుముతో ఈనెల 16 నుంచి 24 వరకు, రూ.500 లేట్ ఫీజుతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ.1000 జరిమానాతో డిసెంబర్ 3 నుంచి 8 వరకు, రూ.2000 లేట్ ఫీజుతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు చెల్లింపులకు అధికారులు అవకాశం కల్పించారు. ఫస్టియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.530తో పాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఫస్టియర్ వొకేషనల్ కోర్సుకు చెందిన విద్యార్థులు రూ.870 చెల్లించాలని అధికారులు తెలిపారు. సెకండియర్ జనరల్ ఆర్ట్స్ గ్రూపునకు చెందిన విద్యార్థులు రూ.530తో పాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. సైన్స్ గ్రూపునకు చెందిన వారు థియరీ రూ.530, ప్రాక్టికల్స్ రూ.240 కలిపి మొత్తం రూ.870 చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా సెకండియర్ వొకేషనల్ విద్యార్థులు రూ.870 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన
హబ్సిగూడలోని సీఐఎస్ సీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న మూడ్రోజుల కోబ్సే సమావేశానికి హాజరయ్యేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చారు. కాగా ఈ బృందం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శుక్రవారం పరిశీలించింది. నేపాల్, భూటాన్ దేశాల్లోని విద్యా బోర్డుల ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలుచేస్తున్న డిజిటల్ పర్యవేక్షణ, పారదర్శకత అంశాలను వారు పరిశీలించారు.
జూనియర్ కళాశాలలను సీసీటీవీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడంతో పాటు విద్యార్థులు, లెక్చరర్ల అటెండెన్స్ ను ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేస్తున్నట్లు బోర్డు అధికారులు వారికి వివరించారు. తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు, పరీక్షల షెడ్యూల్, హాల్‌టికెట్లు, అలర్ట్‌లు వాట్సాప్, మొబైల్ సందేశాల ద్వారా చేరవేస్తున్నట్లు వివరించారు. ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షలు కూడా సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఆ బృందానికి తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, వేగవంతమైన చర్యలు సాధ్యమవుతున్న తీరును ఆ ప్రతినిధులు ప్రశంసించారు.
ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే
తేదీ సబ్జెక్ట్
25-02-2026 పార్ట్ 2(సెకండ్ లాంగ్వేజ్-1)
27-02-2026 పార్ట్ 1(ఇంగ్లిష్ పేపర్-1)
02-03-2026 మ్యాథ్స్ 1ఏ/బోటనీ/పొలిటికల్ సైన్స్-1
05-03-2026 మ్యాథ్య్ 1బీ/జువాలజీ/హిస్టరీ-1
09-03-2026 ఫిజిక్స్/ఎకనామిక్స్-1
12-03-2026 కెమిస్ట్రీ/కామర్స్-1
14-03-2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ)
17-03-2026 మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫ్రీ-1
సెకండియర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..
26-02-2026 పార్ట్ 2(సెకండ్ లాంగ్వేజ్-2)
28-02-2026 పార్ట్ 1(ఇంగ్లిష్ పేపర్-2)
03-03-2026 మ్యాథ్స్ 2ఏ/బోటనీ/పొలిటికల్ సైన్స్-2
06-03-2026 మ్యాథ్య్ పేపర్ 2బీ/జువాలజీ/హిస్టరీ-2
10-03-2026 ఫిజిక్స్/ఎకనామిక్స్-2
13 03-2026 కెమిస్ట్రీ/కామర్స్-2
16-03-2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్-2(బైపీసీ)
18-03-2026 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్/జియోగ్రఫ్రీ-2
Also Read: Telangana Budget 2025: తెలంగాణ బడ్టెట్.. కేబినేట్ తో సీఎం రేవంత్ కీలక సమావేశం
