Telengana High Court: సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana Local Body (Image Source: Twitter)
Telangana News

Telengana High Court: సర్పంచ్ ఎన్నికలు ఆపాలంటూ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telengana High Court: గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. తొలి విడత నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లలో ఎలాంటి స్పష్టత లేకుండానే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జీవో 46 జారీ చేయచేయడాన్ని తప్పుబడుతూ వెనుకబడిన కులాలకు చెందిన వారు హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే?

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన జీవో 46పై ఎలాంటి స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. బీసీలలో ఏ, బీ, సీ, డీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ మెుదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎందుకు సవాలు చేస్తున్నారంటూ పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు ఎన్నికలు రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా? అంటూ నిలదీసింది. ఎన్నికలు నిర్వహించాలని గతంలో తామే తీర్పు ఇచ్చామని.. ఇప్పుడు దానిని అతిక్రమిస్తూ స్టే ఎలా ఇవ్వగలమని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వానికి కీలక ఆదేశం

మరోవైపు సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని గత కొన్నిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేటి తీర్పుతో చెక్ పడినట్లైంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ సూచించిన తేదీల ప్రకారమే తెలంగాణలో మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

Also Read: Anantapur Crime: నా కూతుర్ని కొట్టేవాడు.. చెప్పుకోలేక ఎంతో క్షోభ పడింది.. అమూల్య తండ్రి

తొలి నామినేషన్లు ఎన్నంటే?

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి పదవులకు 3,242 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల వర్గాలు తెలిపాయి. వార్డు సభ్యుల కోసం 1,821 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. కాగా ఇవాళ, రేపు కూడా నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే తొలి విడతలో 4,236 గ్రామపంచాయతీలు, 37 వేలకు పైగా వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి ఒంటిగంట మధ్య ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

Also Read: Imran Khan’s Son: ఇమ్రాన్ ఖాన్ మృతిపై వదంతులు.. పాక్ ప్రభుత్వానికి కుమారుడు స్ట్రాంగ్ వార్నింగ్!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!