New Municipality: తెలంగాణలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ (NekKonda Gram Panchayat)ని మున్సిపాలిటీగా మార్చేందుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే నెక్కొండ మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో వరంగల్ జిల్లాలో కొత్తగా మరో మున్సిపాలిటీ యాడ్ కాబోతోంది.
అంతకుముందు నెక్కొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి (Yamuna Reddy).. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరారు. నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Bandi Sanjay: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. సూటిగా ప్రశ్నల వర్షం!
వరంగల్ జిల్లా విషయానికి వస్తే అక్కడ మెుత్తం మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వర్ధన్నపేట, నర్సంపేట, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా పనిచేస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కూడా అందులో చేరితో వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరనుంది. కాగా నెక్కొండ గ్రామ పంచాయతీ.. మున్సిపాలిటీగా రూపొంతరం చెందితే ఆ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
