Teacher Training: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా విదేశీ విద్యావిధానం(Foreign education policy)పై టీచర్లకు అవగాహన కల్పించి ఆ విధానాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడంపై దృష్టిసారిస్తోంది. కాగా టీచర్లకు విదేశీ విద్యా విధానంపై అవగాహన పెంపొందించేందుకు టీచర్లను పలు దేశాల్లో టూర్లకు తీసుకెళ్లనుంది. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్(Oct), నవంబర్(Nov) నెలల్లో ఈ పర్యటనలు ఉండనున్నాయి.
ఒక్కో బ్యాచ్ కు 40 మంది చొప్పున..
4 విడుతల్లో మొత్తం 160 మందిని తీసుకెళ్లేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 160 మందిని 4 బ్యాచ్ ల్లో ఒక్కో బ్యాచ్ కు 40 మంది చొప్పున తీసుకెళ్లనుంది. 5 రోజుల పాటు ఈ టూర్ కొనసాగనుంది. కాగా ఈ టీచర్ల ఎంపికకు విద్యాశాఖ పలు నిబంధనలు పెట్టింది. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్లను ఎంపిక చేయనున్నారు. పదేండ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండి, 55 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారికి ఇందులో అవకాశం కల్పించనున్నారు. ఒక్కో జిల్లా నుంచి 3 చొప్పున బెస్ట్ టీచర్లను ఎంపిక చేసి విద్యాశాఖకు పంపించాలని ఆదేశించారు.
Also Read: Shocking Incident: రైలులో సీటు ఇవ్వలేదని.. పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. వీడియో వైరల్
ఓక్కో క్యాడర్ లో ఒక్కోక్కరు..
ఎస్జీటీ(SGT) తత్సమాన కేడర్ లో ఒకరు, స్కూల్ అసిస్టెంట్(School Assistant) తత్సమాన కేడర్ లో ఒకరు, జీహెచ్ఎం(GHM) లేదా ప్రిన్సిపాల్ కేడర్(Principal) లో ఒకరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేసి పేర్లు పంపించాలని సూచించారు. సింగపూర్(Singapur), ఫిన్లాండ్(Finland), వియత్నాం(Viyathnam), జపాన్(Japan) లో ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.
