Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు (Telangana RTC Employees) రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ(DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి(Transport Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరుస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, తాజా నిర్ణయంతో సర్కారుపై ప్రతినెల రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు తక్షణమే చెల్లించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 22 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందుంచారు. అందులో ప్రధానమైన డిమాండ్ డీఏ పెంపు. ఈ నేపథ్యంలో డీఏ పెంపు ఉత్తర్వులు తక్షణమే అమలులోకి రానున్నాయి. డీఏ చెల్లించే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెండున్నర శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా శక్తి బస్సులు…
డీఏ పెంచుతూ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం…శనివారం మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళామణులకు కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకొచ్చారు. తరువాత దశలో మరో 450 బస్సులు తీసుకురానున్నారు. మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. ఇందిరా మహిళఆ శక్తి బస్సులను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా శనివారం నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభం కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Also Read:
Womens Day: దేశ చరిత్రలో తొలిసారి.. మహిళా పోలీసులతో ప్రధానికి భద్రత
Seed Scam: ఏజెన్సీల్లో సీడ్ బాంబ్! అనుమతులు లేని విత్తనాలు… వేల ఎకరాల్లో సాగు?