Telangana Govt ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Govt: అందరిచూపు ఆ జీవో వైపు.. బీసీ రిజర్వేషన్లపై నేడు రానున్న క్లారిటీ!

Telangana Govt: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government)  జీవో ను శుక్రవారం జారీ చేయబోతున్నట్లు సమాచారం. బీసీలకు 42శాతం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన జీవోను జారీ చేసి ఎన్నికలకు వెళ్లబోతుంది. బీసీలకు 42శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27శాతం రిజర్వేషన్లను అమలు చేయబోతుంది. ఇప్పటివరకు 50శాతం రిజర్వేషన్లు మించొద్దని ఉన్న చట్టాన్ని తొలగించనుంది. మొత్తంగా రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్

ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ అమలు

జీవోతో రిజర్వేషన్లు అమలు చేయనుంది. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల సీలింగ్ చట్టాన్ని జీవోతో సవరించబోతుంది. ఆతర్వాత ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ అమలు చేయనున్నది. ఇది ఇలా ఉండగా డెడికేషన్ కమిషన్ సేకరించిన ఇంపిరికల్ డేటా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాసెస్ అంతా సోమవారంలోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అధికారులతో సీఎస్ భేటి

పంచాయతీరాజ్ శాఖ తో పాటు పలుశాఖల అధికారులతో గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. రిజర్వేషన్లపై ఇచ్చే జీవో, జీవో విడుదల తర్వాత పంచాయతీరాజ్ చేయబోయే అంశాలు, ఎన్నికల కమిషన్ కు ఎలాంటి అంశాలు అందజేయాలనేదానిపై చర్చించినట్లు సమాచారం. ఎక్కడ కాలయాపన జరుగకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం. జీవోపై ఎవరైనా కోర్టును ఆశ్రయించకముందే శాఖల తరుపున కార్యచరణ కంప్లీట్ చేయాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలని సీఎస్ సూచించినట్లు సమాచారం.

 Also Read: US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

Just In

01

New Liquor Shops: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల..ఈ రూల్స్ ప్రకారమే కేటాయింపులు పూర్తి వివరాలు ఇవే?

Aadhaar Download WhatsApp: ఇంట్లోనే ఉండి వాట్సాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా.. నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

Ind vs Pak Asia Cup Final: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టీమిండియాను వేధిస్తున్న చెత్త రికార్డు.. ఓటమి తప్పదా?

OTT Movie: ఫేమస్ స్టార్ యాక్టర్ ఒక లేడీ వెయిటర్ ప్రేమలో పడితే.. ఏం జరిగిందంటే?

The Strangers Chapter 2 review: ఎవరో? ఎందుకో? తెలియకుండా చంపేస్తుంటారు.. చూస్తే వణకాల్సిందే..