Seethakka: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన మహిళల ఆర్దికాభివృద్దికి పెద్ద పీట వేస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అనసూయ సీతక్క (Seethakka) అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారా హిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో రూ.93.50 క్షలతో నూతనంగా నిర్మించిన మహిళాభవన్ ను మంత్రులు ప్రారంభించారు. అంతకు ముందు మంత్రులు యూసుఫ్ గూడా డివిజన్ లోని కృష్ణానగర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.కృష్ణా నగర్ లో వర్షం కురిసినప్పుడు వరద రావడానికి కారణమైన నాలలను మంత్రులు పరిశీలించారు. నాలాలు బాటిల్ నెక్ ప్రాబ్లం వల్లే కృష్ణా నగర్ లో వరదలు సంభవిస్తున్నట్లు గుర్తించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కృష్ణా నగర్ లో భవిష్యత్ లో వరద రాకుండా ఉండడానికి ఇప్పుడున్న నాలాలు అభివృద్ధి చేయడానికి జీహెచ్ ఎంసీ ఎస్ ఎన్ డీపీకి అప్పగించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు కృష్ణానగర్ లో కొనసాగుతున్న జీహెచ్ఎంసీ పెండింగ్ పనుల పై ఆరా తీశారు. జీహెచ్ ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి సూచించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళల భద్రతతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తుందన్నారు.
Also Read: Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు
మహాలక్ష్మి స్కీమ్ తో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
గతంలో ఈ సర్కారు ఇవ్వని ప్రాధాన్యతను మహిళల ఆర్థికాభివృద్ధికి ఇచ్చినట్లు గుర్తించారు. ప్రజాపాలన మొదలు కాగానే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ తో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోటి మంది మహిళలనున కోటీశ్వరులను చేసేందుకు సర్కారు స్వయం సహాయక బృందాల ద్వారా చేస్తున్న ప్రయత్నానికి మహిళలు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాధ్ తదితరులున్నారు.
రెండు రోజుల్లో రిసోర్స్ పర్సన్స్ జీతాలు చెల్లిస్తాం: మంత్రి సీతక్క
పెండింగ్ లో ఉన్న రిసోర్స్ పర్సన్స్ ల జీతాలను రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ సుమరూ 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉండి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారని వివరించారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పొన్నం సారధ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావటంతో పాటు వైఎస్సార్ హయాంలో మహిళలను పావలా వడ్డీ తోసుకొచ్చి లక్షాధికారులను చేయగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు.
రూ. 10 లక్షల బీమా
రుణాలిచ్చేందుకు ఒకప్పుడు భయపడిన బ్యాంకు లు మహిళా సంఘాలు అంటే ఎంత లోనైన ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని, మహిళా సంఘాలు తీసుకుంటున్న రుణాల రీ పేమెంట్ శాతం సుమారు 98 శాతం వరకు ఉండటం గర్వకారణమని వివరించారు. వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తూ పెట్రోల్ బంకులు ,ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ,కుట్టు మిషన్ లు ,పిల్లలకు మహిళా సంఘాలు ద్వారా బట్టలు కుట్టించే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఇన్సూరెన్స్ కూడా అమలు చేస్తున్నామని, వారికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే రూ. 10 లక్షల బీమా వర్తంపజేస్తున్నామన్నారు.
ఈ బీమా స్కీమ్ తో రూ. 2 లక్షలను మాఫీ
ఇప్పటి వరకు సుమారు 410 మంది సభ్యులు మరణిస్తేరూ. 41 కోట్ల బీమా సొమ్ము వారి కుటుంబాలకు అందజేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ బీమా స్కీమ్ తో రూ. 2 లక్షలను మాఫీ చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు యూనిఫాం ఉండాలని చేనేత కార్మికులకు పని కల్పించి ఒక్కో మహిళకు రెండు చీరలు అందిస్తున్నామన్నారు.గర్భిణీలు, మహిళలకు మంచి పౌష్టిక ఆహారం అందించేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గతంలో అంగన్వాడీ టీచర్ లకు సెలవులు ఉండది కాదని, ఇపుడు వారికి సమ్మర్ లో కూడా హాలిడేస్ ఇస్తున్నామన్నారు.
Also Read: Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?