Minister Sridhar Babu: తెలంగాణను దేశానికి ‘ఏరోస్పేస్ రాజధాని’గా తీర్చిదిద్దేలా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. సచివాలయంలో ఫిక్కీ తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ కమిటీ సహకారంతో రాష్ట్రంలోని ప్రముఖ ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో మంత్రి మేధోమథనం నిర్వహించారు. తెలంగాణ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏరోస్పేస్ ఎకోసిస్టం బలోపేతానికి 60 ఏళ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయని, ఇప్పుడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.
ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్..
హైదరాబాద్(Hyderabad)లో ఇప్పటికే 30కి పైగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓఈఎంఎస్ లు, వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, డీఆర్డీవో(DRDO), హాల్(HOL), జీఎంఆర్(GMR), టాటా(TATA), అదానీ ఎల్బిట్, సాఫ్రాన్(SAFRAN), బోయింగ్- టీఏఎస్ఎల్ జేవీ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా ఉందన్నారు. రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ రూ. 28,000 కోట్లకు పైగా ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశ ఏరోస్పేస్ రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఫేజ్-2 ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈ(MSME) పార్కును ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
Also Read: OG collections: మొదటి రోజు రికార్డులు సృష్టించిన ‘ఓజీ’ కలెక్షన్స్.. ఎంతంటే?
నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్..
హైదరాబాద్ ను గ్రీన్ ఏవియేషన్ హబ్ గా తీర్చి దిద్దేలా డ్రోన్ టెక్నాలజీ(Drone technology), గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్స్ రంగాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. పారిశ్రామికాభివృద్ధి, అనుమతుల్లో జాప్యం తలెత్తకుండా అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏరోస్పేస్ రంగంలో స్కిల్డ్ వర్కర్స్ కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ఐటీఐ(ITI)లు, పాలిటెక్నిక్ కళాశాలలను దత్తత తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. యువతను డిజైన్, ఏవియానిక్స్, కాంపోజిట్స్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ తదితర అధునాతన రంగాల్లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఈసీ సమావేశం.. నేడు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం!