CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో ముందుకువెళ్తోంది. విద్యారంగం అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. నియామకాలు పదోన్నతులతో గురువులకు పెద్దపీట వేస్తోంది. పాఠశాలల నుంచి విశ్వ విద్యాలయాల వరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. తరగతి గదిలో దేశ భవిష్యత్ రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారి వ్యాఖ్యానించారు. అటువంటి తరగతి గదిని సజీవంగా ఉంచేది, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివద్ధిపై దృష్టి పెడుతోంది. రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తనను తాను ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. దీన్నిబట్టి ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు.
ఏడాదిలో 10,006 మంది టీచర్ల నియామకం
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు, కళాశాలల్లో లెక్చరర్లు ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన ఏడాదిలోపే 10,006 మంది ఉపాధ్యాయులను, జూనియర్ కళాశాలల్లో 1,265 మంది జూనియర్ లెక్చరర్లు, 64 మంది జూనియర్ అసిస్టెంట్లు, 30 మంది లైబ్రేరియన్ల నియామకాన్ని చేపట్టింది. అంతేకాకుండా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 19,717 మంది ఉపాధ్యాయులకు 2024లో కాంగ్రెస్ సర్కార్ ప్రమోషన్లు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా 46,555 మంది ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పూర్తిచేసింది.
Also Read: CM New Helicopter: చంద్రబాబుకు కొత్త హెలికాఫ్టర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రాష్ట్రవ్యాప్తంగా 1,13,942 ఉపాధ్యాయులు
2025 ఆగస్టులో 4,454 మంది ఉపాధ్యాయులకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లుగా పదోన్నతదులు కల్పించింది. 55 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా, 22 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్లు కల్పించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నాణ్యమైన బోధనకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1,13,942 ఉపాధ్యాయులు, 5,605 రిసోర్స్ పర్సన్లకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహించింది. ఉపాధ్యాయుల నియామకం హేతుబద్ధమైన బదిలీల విధానంతో ఈ ఏడాది 41 నూతన పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో 1565 మంది విద్యార్థులు చేరారు.
తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్
ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ రాయాలంటే తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్షలో(టెట్) అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి 2014 వరకు నాలుగుసార్లు టెట్ నిర్వహించగా, బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్ నిర్వహించింది. 2018 నుంచి 2021వరకు వరుసగా నాలుగేళ్లు టెట్ ను గత ప్రభుత్వం నిర్వహించలేదు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2024 మే, జూన్ నెలల్లో ఒకసారి, అదే ఏడాది డిసెంబర్ లో రెండోసారి, 2025 జూన్ లో మూడోసారి టెట్ ను నిర్వహించింది.
రూ.21,292 కోట్లు
పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందడంతో పాఠశాలలో వసతులు మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిధుల కేటాయింపును గతంతో పోలిస్తే పెంచారు. 2023-24 బడ్జెట్‌లో బీఆర్ఎస్ సర్కార్ విద్యా రంగానికి రూ.19,093 కోట్లు కేటాయిస్తే, రేవంత్ రెడ్డి సర్కార్ 2024-25 బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు అధికంగా అంటే రూ.21,292 కోట్లు కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.23,108 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌లో ఇది సుమారు 8 శాతానికి సమాన. పాఠశాలల్లో పని చేసే విద్యార్థుల తల్లులతో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఆయా స్కూళ్లలో తలుపులు, కిటీకీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ స్విచ్ లు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల మరమ్మతులు, గదులకు రంగులు వేయడం వంటి పనులను ఎండా కాలం సెలవుల్లోనే పూర్తి చేశారు.
7,65,700 మంది విద్యార్థులకు లబ్ధి
ఇందుకు రూ.676 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా ఉండగా కాస్మోటిక్ చార్జీలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950గా ఉన్న డైట్ చార్జీలను రూ.1,330కి, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల డైట్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.1,540కి పెంచింది. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు రూ.1,500గా ఉన్న డైట్ చార్జీలను రూ.2,100కి పెంచింది. అలాగే 3వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు గతంలో కాస్మొటిక్ చార్జీలు రూ.55 ఉండగా వాటిని రూ.175కు, 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు రూ.75గా ఉన్న కాస్మొటిక్ చార్జీలను రూ.275కు సర్కార్ పెంచింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 7,65,700 మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది.
Also Read: CM Revanth Reddy: వందేళ్లలో రానంత వరద.. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ.. సీఎం రేవంత్ హామీ