Telangana govt( image credit: twitter)
తెలంగాణ

Telangana govt: టీచర్ల సర్దుబాటుకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Telangana govt: పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదనంగా ఉన్న టీచర్లను అవసరమున్న స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు వీలు కల్పించింది. కాగా ఈ ప్రక్రియకు కలెక్టర్లకు అధికారమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు పనిచేస్తున్న జిల్లాల్లోనే సర్కార్ సర్దుబాటుకు అవకాశం కల్పించింది. అయితే ఇందులో పలు నిబంధనలను సర్కార్ ప్రవేశపెట్టింది. ఏజెన్సీల్లో పనిచేసే టీచర్లను ఏజెన్సీ ప్రాంతంలోనే టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు అడ్జస్ట్ చేసేలా నిబంధనను తీసుకొచ్చారు.

అదే సమయంలో నాన్ ఏజెన్సీ టీచర్లను ఏజెన్సీ ప్రాంతాల్లో సర్దుబాటు చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ట్రైబల్ ఏరియాలో ఉన్న టీచర్లను నాన్ ఏజెన్సీ ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశం లేదు. అలాగే సర్దుబాటుకు కేడర్ ప్రకారం జూనియర్లకు ప్రియారిటీ ఇవ్వనున్నారు. మ్యూచువల్ అడ్జస్ట్ మెంట్ కు ఏమాత్రం అవకాశం కల్పించకుండా సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. సర్దుబాటు అయిన టీచర్లంతా జూన్ 13 లోగా ఆయా స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని స్పష్టంచేశారు. కాగా ఈ నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు వ్యక్తంచేయడం గమనార్హం.

Also Read: Bhatti Vikramarka Mallu: ఆదివాసి, నిరుపేదల సంక్షేమమే.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ ముమ్మరం చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో ఉండే టీచర్లను నాన్ ఏజెన్సీ ప్రాంతాలకు పంపిస్తే ట్రైబల్ ప్రాంతాలకు వెళ్లే వారు ఉండరని, దీంతో విద్యార్థులకు నష్టమని భావించి సర్కార్ ఏజెన్సీ టీచర్లు ఆ ఏరియా పరిధిలోనే అడ్జస్ట్ మెంట్ చేసేలా నిబంధన తీసుకొచ్చింది. అలాగే మ్యూచువల్ అడ్జస్ట్ మెంట్ల వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవడంతో పాటు అవినీతికి ఆస్కారమిచ్చినట్లవుతుందని భావించి మ్యూచువల్ సర్దుబాటును లేకుండా చేశారు. అయితే ఈ టీచర్ల సర్దుబాటు ప్రక్రియ టెంపరరీ ప్రాతిపదికనే కొనసాగుతుందని, టీచర్లకు వేతనాలు గతంలో లాగే కొనసాగుతాయని, మార్పులు ఉండబోవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీచర్ల అవసరమున్న స్కూళ్లకు సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల వివరాలను కలెక్టర్లు జూన్ 30 నాటికి పాఠశాల విద్య డైరెక్టర్‌కు అందించాలని స్పష్టం చేశారు.

సర్దుబాటు ఉత్తర్వులపై యూటీఎఫ్ ఆగ్రహం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, అభ్యసనా సామర్థ్యాలు పెంచాలని అందుకు ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు.. సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణమని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతుందని, ఈ ఏడాది నమోదు పెంపుకోసం సమిష్టిగా కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

పాఠశాలలు ప్రారంభం కాకుండానే, విద్యార్థుల నమోదును పట్టించుకోకుండా జూన్ 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని యూటీఎస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోకుండా సర్దుబాటు పేరిట ఇతర స్కూళ్లకు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక విద్యా రంగానికి గొడ్డలి పెట్టని వారు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Collector Anudeep durishetty: లింగ నిర్ధారణ చట్టంపై.. ప్రజలకు అవగాహన కల్పించాలి!

ప్రైమరీ, యూపీఎస్ లలో 1-10 విద్యార్థులకు ఒక టీచర్, 11-60 మందికి ఇద్దరు, 61-90 మందికి 3 టీచర్లు, 91-120 వరకు నలుగురు, 121-150 మందికి ఐదుగురు, 151-200 మందికి ఆరుగురు టీచర్లు, 200 మందికి పైగా విద్యార్థులుంటే ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ మస్ట్ అని విద్యాశాఖ స్పష్టంచేసింది. కాగా 11 నుంచి 60 మంది స్టూడెంట్స్ కు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండాలని ఆదేశించడం సమంజసం కాదని యూటీఎఫ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపే ఉంటుందని, ఉన్న ఉపాధ్యాయులను తొలగిస్తే తల్లిదండ్రులకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. కనీసం 40 మందికి ఇద్దరు, 41 నుంచి 60 మంది స్టూడెంట్స్ కు ముగ్గురు, 61 నుంచి 90 మందికి నలుగురు ఉండేలా నిబంధనలు సవరించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది.

Also Read: L&T on Medigadda Barrage: అంతుపట్టని ఎల్ అండ్ టీ వైఖరి.. బీఆర్ఎస్‌ పాలనలో ఒకలా.. కాంగ్రెస్‌ హయాంలో మరోలా!

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు