Saree Distribution: రాష్ట్రంలో మహిళలకు చీరల పంపిణీ చేయడానికి ప్రభుత్వం క్లారీటీనిచ్చింది. గతంలో బతుకమ్మ పండుగకు మహిళాశక్తి పేరుతో చీరల పంపినీ చేయాలనుకున్న ప్రభుత్వం అప్పటికి చీరలు సిద్దం కాక పోవడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అందుకు గాను వీటిని నవంబర్ 19, ఇందిరా గాంధీ జయంతి రోజున మహిళలకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికోసం రానున్న కాలంలో నవంబర్ 15 వ తేది కల్లా అన్నీ సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు తెలిపింది. దీంతో అధికారులు చీరల ఎర్పాట్ల పనుల్లో స్పీడు పెంచారు.
నాణ్యతలో రాజీ లేకుండా..
గత ప్రభుత్వం బీఆర్ఎస్ బతుకమ్మ పండుగరోజున మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అప్పటి నుండే తెలంగాణలో ఈ కార్యక్రమం మొదలైంది. అయితే గతంలో కేసీఆర్(KCR) ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు నాసిరకంగా క్వాలిటీ లేకుండా ఉన్నాయని తీవ్ర విమర్షలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తామని తెలిపింది. చీరల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా మంచి నాణ్యమైన చీరలను తయారుచేయడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా చేనేత కార్మికులచేత చర్చలు జరిపి నానణ్యమైన చీరలను తయారు చేయిస్తున్నారు. అందుకుగాను ఎక్కువ సమయం పట్టడంతో బతుకమ్మ పండుగకు పంపిణీ చేయాల్సిన చీరలు అందుభాటులోకి రాలేక పోయాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ఇందిరా గాంధీ జయంతీ రోజున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్నయించింది.
Also Read: Dude Movie: ఇంకేం కావాలో అర్థం కావడం లేదు.. మిక్స్‌డ్ టాక్‌పై మైత్రీ నిర్మాత షాకింగ్ కామెంట్స్
ప్రభుత్వ గణాంకాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహయక బృందాల్లో 1.94లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే వీరందరికి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్నయించింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే ప్రభుత్వానికి మోత్తం 1.90 లక్షల చీరలు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. దీంతో మెత్తానికి చీరల పంపిణీ కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రభుత్వం నెరవేర్చనుంది.
Also Read: Dude collection: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
