Dude Movie Team (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Dude Movie: ఇంకేం కావాలో అర్థం కావడం లేదు.. మిక్స్‌డ్ టాక్‌పై మైత్రీ నిర్మాత షాకింగ్ కామెంట్స్

Dude Movie: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్’ (Dude). మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా దీవాళి స్పెషల్‌గా అక్టోబర్ 17న విడుదలైన మిక్స్‌డ్ స్పందనతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాపై కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, రివ్యూలలో కూడా ఈ సినిమా గురించి దారుణంగా రాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ దీవాళికి విడుదలైన 4 సినిమాలలో కాస్త పరవాలేదని అనిపించుకున్న సినిమా ‘డ్యూడ్’ కావడం విశేషం. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ..

Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!

ఎక్కడ బాలేదో నాకు అర్థం కాలేదు

‘‘సినిమాకు గొప్ప రెస్పాన్స్ వస్తుంది. ప్రతి సీన్‌కి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. జెన్‌జి కాన్సెప్ట్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఒక కొత్త జోనర్ ఫీలింగ్‌ని ఈ సినిమా క్రియేట్ చేసింది. విడుదలైన తర్వాత ఫస్ట్ హాఫ్‌కు యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ వినిపించింది. సెకండాఫ్ విషయంలో మిక్స్‌డ్ టాక్ వినిపించడంతో.. నేను అందరితో కలిసి సినిమా చూశాను. పెళ్లి సీన్, బూమ్ బూమ్ సాంగ్, హీరో క్యారెక్టర్, శరత్ కుమార్ క్యారక్టరైజేషన్, ఇంటర్వెల్, అద్భుతమైన సెకండ్ అన్నిటికీ ఆడియన్స్ హై ఫీల్ అవుతున్నారు. సినిమా ఎక్కడ బాలేదో నాకు అర్థం కాలేదు. సినిమా బాగుండాలి అంటే ఇంకా ఏం చేయాలి. సినిమాలో 20 ఎక్స్‌ట్రార్డినరీ బ్లాక్స్ ఉన్నాయి. ప్రేక్షకులు బాగానే ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. తమిళనాడు, నైజాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ అన్ని చోట్ల ఇది సూపర్ డూపర్ హిట్’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హవా.. నిలబడాలంటే అదే ముఖ్యం!

అద్భుతమైన నెంబర్స్ చూస్తున్నాం

మరో నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. సినిమా విజయం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. మాకు మంచి దివాళి గిఫ్ట్ ఇచ్చినందుకు హీరో ప్రదీప్‌కు, డైరెక్టర్ కీర్తి, టీం అందరికీ థ్యాంక్యూ. సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగు ఐదు రెట్లు ఎక్కువ చేస్తోంది. ఫస్ట్ డే వరల్డ్ రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన నెంబర్స్ చూస్తున్నాం. ఇది ఈ దీవాళికి బిగ్ విన్నర్. కీర్తి అద్భుతమైన కథ రాసుకొని అద్భుతంగా చేశాడు. ప్రదీప్ తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో ఈ సినిమాను చూడండి.. చాలా ఎంజాయ్ చేస్తారని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు