Tollywood Heroines: టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్ల విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన అనుష్క శెట్టి (Anushka Shetty), నయనతార (Nayanthara), సమంత (Samantha), పూజా హెగ్డే (Pooja Hegde) వంటి సీనియర్ తారలు సినిమాల వేగాన్ని తగ్గించడంతో, ఇప్పుడు కొత్త తరం కథానాయికలు అగ్ర స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ యంగ్ బ్యూటీస్‌లో కొందరు ఇప్పటికే తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షించగా, మరికొందరు భారీ ప్రాజెక్టులతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టి సత్తా చాటాలని చూస్తున్న వారిలో మమితా బైజు, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే, కయదు లోహర్ వంటి యంగ్ హీరోయిన్లు ప్రధానంగా ఉన్నారు. వీరు వేరే పరిశ్రమల నుంచి వచ్చి ఇక్కడ తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు.
Also Read- Diwali Movies: తుస్సుమన్న దీవాళి వెండితెర టపాసులు.. ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!
రుక్మిణి వసంత్ రేసులో టాప్..
వీరిలో ముఖ్యంగా రుక్మిణి వసంత్, తన నటనతో ఇప్పటికే ఒకడుగు ముందుంది. ఆమె నటించిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా మంచి విజయం సాధించడం, ఆ తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ లోని తన పాత్రకు ప్రశంసలు దక్కడం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘డ్రాగన్’ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండటం ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే సైతం మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా నిరాశపరిచినా, ఆమెకు మాత్రం రామ్ పోతినేని వంటి హీరోల సరసన వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె కూడా లిస్ట్‌లో ఉన్నట్లే భావించవచ్చు. మమితా బైజు, కయదు లోహర్.. యూత్ ఆడియెన్స్‌ని తమ గ్లామర్‌తో కట్టి పడేస్తున్నారు. ఈ గ్లామర్‌కు తగినట్లుగా సక్సెస్ కూడా పడితే.. వారి హవా కొంతకాలం కొనసాగే అవకాశం లేకపోలేదు.
Also Read- Rashmika Mandanna: విజయ్‌తో ఎంగేజ్‌మెంట్‌పై నేషనల్ క్రష్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
స్టార్ హీరోలకు జాన్వీ కపూర్..
మరోవైపు, బాలీవుడ్‌లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌పై గట్టిగా దృష్టి సారించింది. ఆమె ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమా విజయం జాన్వీకి మంచి బ్రేక్‌ని ఇచ్చింది. ‘దేవర’ పార్ట్-1లోనే కాదు, రామ్ చరణ్‌తో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’తో పాటు, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా అవకాశం సొంతం చేసుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. ‘దేవర 2’ ఎలాగూ ఉంది కాబట్టి.. తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ, జాన్వీ కూడా కొత్త హీరోయిన్ల పోటీలో ముందు లైన్‌లో నిలబడింది. అయితే, ఎంతమంది కొత్తవారు వచ్చినా, ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం అందం, బ్యాక్‌గ్రౌండ్ సరిపోదు, సక్సెస్ అనేది ముఖ్యం. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్లకు, కొత్తవారికి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ యంగ్ బ్యూటీస్‌లో తెలుగు ప్రేక్షకులను ఎవరు మెప్పించి, అత్యధిక విజయాలను సొంతం చేసుకుని, ఫైనల్‌గా ‘టాప్ ఛైర్’ను దక్కించుకుంటారో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. శ్రీలీల, మీనాక్షి ఉన్నా, వాళ్లకి సరైన హిట్ పడటం లేదు. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో రష్మిక మందన్నా హవానే నడుస్తుందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
