Sand Mining: ఇసుక అక్రమ రవాణాను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(State Mineral Development Corporation Limited) అధికారులు సైతం ఒకవైపు మానిటరింగ్, మరోవైపు సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిని అలర్టు చేస్తున్నారు. గోదావరి, మూసీ, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గతంలో ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా తీసుక తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంతో అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం గమనిస్తుంది. పోలీసు(Police), రెవెన్యూ(Revenue), మైనింగ్(Mining), టీఎస్ఎండీసీ(TSMDC)లు సంయుక్తంగా ఇసుక అక్రమరవాణాను అడ్డుకునేందుకు టాస్క్ పోర్సులను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుందనే ఆరోపణలతో ఇసుక క్వారీలు(రీచ్)లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుంది. అదే విధంగా లోడింగ్ సమయాలను నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక లోడింగ్ కు మాత్రమే అనుమతిస్తుంది.
పరిమితికి మించి తరలిస్తే..
ఒక వేబిల్లుపై ఒక వాహనంలో ఒకసారి మాత్రమే ఇసుక తరలించేందుకు వీలుటుంది. రెండోసారి తరలిస్తే గమనించి చర్యలు తీసుకోనున్నారు. అంతేగాకుండా ఇసుక రీచ్ ల సమీపంలో వేయింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రైవేటు వేయింగ్ బ్రిడ్జిలతో లెక్కింపు చేపడుతున్నారు. ఎవరైనా పరిమితికి మించి ఇసుకను వాహనంలో తరలిస్తే జరిమానాతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు.
అక్కడ సీసీ కెమెరాలు
హైదరాబాద్ సిటీలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాండ్ బజార్ లను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ చేశారు. మానిటరింగ్ చేయడంతో ఫలితాలు రావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 60 రీచ్ లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా ఇసుక రీచ్ ల వద్ద రవాణాకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60వేలకు లారీలు నమోదు చేసుకున్నాయి. అయితే వాటన్నింటికి త్వరలోనే జీపీఎస్(GPS) అమర్చబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే 9500 లారీలకు జీపీఎస్ అమర్చినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా సీసీ కెమోరాలతో ఓవర్ లోడ్ కు సైతం చెక్ పెట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్ర కార్యాలయంలో డ్యాష్ బోర్డు..
మరోవైపు ప్రతి రోజూ ఏ ఇసుక రీచ్ నుంచి ఎంత ఇసుకను తోడుతున్నారు(రవాణా లోడింగ్)చేస్తున్నారు.. ఏ వాహనంలో ఎంత ఇసుకను తరలిస్తున్నారు.. ఆయన ప్రభుత్వం చెల్లించిన డీడీ (అమౌంట్)ఎంత? ఎంత లోడింగ్ చేస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయంలో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేయబోతున్నట్లు సమాచారం. ప్రతిరోజూ వివరాలను తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా సీసీ కెమెరాలతో రీచ్ ల మానిటరింగ్ కోసం ఐటీ టీంను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మానిటరింగ్ కోసం సీసీ కెమెరాలు..
ఈ టీంలో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. ఐటీపై ప్రస్తుత కార్పొరేషన్ ఎండీ అండ్ చైర్మన్ భవేష్ మిశ్రాకు పట్టుండటంతో ఇసుక రీచ్ ల మానిటరింగ్ కోసం సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేగాకుండా రాష్ట్రంలో ఎన్ని వేయింగ్ బ్రిడ్జీలు ఉన్నాయి… రీచ్ ల సమీపంలో ఎన్ని ఉన్నాయనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. వాటి పనితీరుపైనా ఆరా తీస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వం సైతం రీచ్ ల వద్ద వేయింగ్ బ్రిడ్జీల ఏర్పాటుకు కసరత్తును ప్రారంభించింది. ఏది ఏమైనా ప్రభుత్వం, ఎండీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఓవర్ లోడ్, అక్రమ ఇసుక తరలింపునకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
Also Read: Bhatti Vikramarka: నవీన్ పీజేఆర్‌లా పనిచేస్తారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్రజలకు మంత్రుల విజ్ఞప్తి!
