TG Seeds: రైతులకు టీజీ సీడ్స్ చేరేలా ప్రణాళికలు సిద్ధం
TG Seeds (imagecredit:twitter)
Telangana News

TG Seeds: రైతులకు టీజీ సీడ్స్ చేరేలా ప్రణాళికలు సిద్ధం

TG Seeds: విత్తనంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైతులు నష్టపోకుండా టీజీ సీడ్స్ విత్తనాలు వారికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. విత్తన డీలర్లకు టార్గెట్ పెట్టబోతుంది. రైతులకు అవగాహన కల్పించి ప్రభుత్వం ఇస్తున్న భరోసాను సైతం వివరించాలని ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఈ యాసంగిలో లక్షా 20వేల క్వింటాళ్ల వరి విత్తనం అమ్మేలా సీడ్స్ కార్పొరేషన్ టార్గెట్ నిర్దేశించుకుంది. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు ప్రభుత్వ విత్తనం నాణ్యత, దిగుబడిపై రైతు వేదికల్లో వివరించనున్నట్లు సమాచారం.

ప్రైవేట్ కంపెనీ విత్తనాలతో రైతులకు నష్టం

ప్రైవేటు కంపెనీల విత్తనాలతో ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారు. పంట దిగుబడి రాక తెగుళ్లు సోకడం తదితర కారణాలతో తీవ్రంగా నష్ట పోతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పాటు ప్రభుత్వ అధ్యయనంలో సైతం తేలింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థతో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటుంది. రైతులకు దిగుబడి వచ్చే విత్తనాలను పంపిణీ ఇప్పటికే చేస్తున్నప్పటికీ టార్గెట్ పెట్టుకొని రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటుంది. ఈ యాసంగి(రబీ)కి లక్షా 20వేల క్వింటాళ్ల వరి విత్తనాలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరేందుకు.. నాణ్యమైన విత్తనాలు రైతులకు చేరేందుకు విత్తన విక్రయ డీలర్లకు సైతం టార్గెట్ పెట్టబోతుంది. ఒక్కో డీలర్ సుమారు 20 క్వింటాల్లు అమ్మకం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. డీలర్లు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ తీసుకొని ప్రైవేటు కంపెనీలకు విత్తనాలు విక్రయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం 26 వేల క్వింటాల్లు మాత్రమే వరి సీడ్స్ అమ్మినట్లు సమాచారం. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వానాకాలంలో 56 వేల క్వింటాళ్లకు పెంచినట్లు అధికారులు తెలిపారు. తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల క్వింటాల్లను విక్రయించేందుకు పక్కా ప్లాన్‌ను ప్రభుత్వం, సీడ్స్ కార్పొరేషన్ రూపకల్పన చేస్తున్నాయి.

Also Read: KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. తడిగుడ్డతో గొంతు కోశారు.. కేటీఆర్ ఫైర్

ఈ మూడింటిలో ప్రభుత్వ సీడ్స్ అమ్మకం

తెలంగాణలో 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 987 ఆగ్రోస్ కేంద్రాలు, 15వేల వరకు విత్తన-ఫెర్టిలైజర్స్ డీలర్స్ ఉన్నారు. ఈ మూడింటి లో ప్రభుత్వ సీడ్స్ అమ్మకం చేశారు. అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం సీడ్స్ విక్రయిస్తే 8శాతం కమిషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో డీలర్స్ ప్రభుత్వ విత్తనాల అమ్మకంను నిలిపివేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఒత్తిడిచేస్తే కొద్దిమేర మాత్రమే అప్పుడప్పుడు విక్రయించి మిగతా స్టాక్ ను రిటన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్స్ తీసుకున్న డీలర్స్ విధిగా టీజీ సీడ్స్ విత్తనాలు అమ్మకం చేపట్టేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. సబ్సిడీపై జిలుగు, జనుము తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న రైతులు ఎందుకు తీసుకోవడం లేదని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం టీజీ సీడ్స్‌పై సరైన ప్రచారం లేకపోవడంతోనే తగినంత ఆధారణ రావడం లేదని గమనించి త్వరలోనే విస్తృత ప్రచారానికి సైతం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

10 రకాల విత్తనాలు సరఫరా

టీజీ సీడ్స్‌లో కేఎన్ఎం-1638 ఎకరా 28 నుంచి 30 క్వింటాల్లు, తెలంగాణ సోన(ఆర్ఎన్ఆర్-15048) ఎకరా 26 నుంచి 28 క్వింటాల్లు, జేజీఎల్-27356 ఎకరా 28 క్వింటాల్లు, ఆర్ఎన్ఆర్-28361 ఎకరా 30 నుంచి 32 క్వింటాల్లు, జేజీఎల్-24423 ఎకరా 34 క్వింటాల్లు దిగుబడి వస్తుంది. ఇలా 10 రకాల ధాన్యం రకాలను ప్రభుత్వం విత్తన సరఫరా చేస్తుంది. ప్రైవేటుకు ధీటుగా దిగుబడి వస్తున్నప్పటికీ కేవలం గత ప్రభుత్వం విత్తన విక్రయానికి డిస్కౌంట్ ను డీలర్లకు ఇవ్వకపోవడంతోనే అమ్మకాలు చేపట్టడం లేదని సమాచారం. అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అన్ని మండలాల్లో పీఏసీఎస్, ఏఆర్ఎస్కే, డీసీఎంఎస్, ఎస్హెచ్జీ, ఎఫ్పీఓ, ఎఫ్పీసీ, ఇతర డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. 8శాతం డిస్కౌంట్ తో విత్తనాలు అందజేస్తుంది. 2 టన్నులపైన విత్తనాలు ఆర్డర్ చేస్తే 8 డిస్కౌంట్ తో పాటు రవాణా ఖర్చులు లేకుండా గ్రామాలకు సరఫరా చేయనున్నారు.

నేడు డీలర్లతో సమావేశం

హాకా భవన్ లోని సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని విత్తన,ఫర్టిలైజర్స్ డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం విత్తనం అమ్మకాలపై చర్చించనున్నట్లు సమాచారం. డీలర్లకు టార్గెట్ పెట్టి అమ్మకం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన డీలర్లు విధిగా ప్రభుత్వ విత్తనం అమ్మకం చేపట్టాలని లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విత్తనంతో ప్రభుత్వం భరోసా ఇచ్చే అంశాన్ని సైతం రైతులకు వివరించాలని ఆదేశించనున్నట్లు తెలిసింది.

Also Read: Minister Seethakka: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్.. స్ట్రాంగ్ కౌంటర్..!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు