Solar Project (imagecredit:twitter)
తెలంగాణ

Solar Project: రాష్ట్ర దేవాదాయ శాఖ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Solar Project: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే ఆ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించబోతున్నది. గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని విధంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు(Solar plants) కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక అభ్యున్నతితోపాటు ఉపాధికి భరోసా లభించనున్నది. అయితే సోలార్ పవర్ ప్లాంట్‌ను తొలుత ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేవాదాయశాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు సేకరించింది.

ఆ జిల్లాల్లో ఆలయ భూముల గుర్తింపు 

సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి దేవాదాయశాఖ అధికారులు హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆలయ భూములను గుర్తించారు. హైదరాబాద్(సికింద్రాబాద్)లో 32.26 ఎకరాలు, మెదక్ జిల్లాలో 109.06 ఎకరాలు, నల్గొండ(యాదాద్రి భువనగిరి)లో 26.33 ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 356.34 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 33.17 ఎకరాలు, కరీంనగర్ లో 21.31 ఎకరాలు, వరంగల్ లో 26.34 ఎకరాలు, ఆదిలాబాద్ లో 96.36 ఎకరాలు, నిజామాబాద్ లో 14.35 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఇందులో సబ్ స్టేషన్లు 2 కిలో మీటర్లు దూరంలో ఉన్న ఆలయ భూమి 292.24 ఎకరాలు, 3 కిలోమీటర్ల పరిధిలో 399.36 ఎకరాలు, 4 కిలో మీటర్ల దూరంలో 11 ఎకరాలు, 5 కిలో మీటర్ల దూరంలో 15.32 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే తొలి విడతలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో(సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ) 284.09 ఎకరాలు ఆలయ భూములు ఉండగా 231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది.

విద్యుత్ సబ్ స్టేషన్లకు 2 కిలో మీటర్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములనే తొలి విడతగా ఎంపిక చేశారు. అయితే ఇందులో 51 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. సంబంధిత ఫైల్ సైతం ఎండోమెంట్ కమిషనర్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అయితే సెర్ప్(పంచాయతీరాజ్ శాఖ)తో త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఒప్పంద పత్రంలో ఏయే నిబంధనలు ఉండాలి? భవిష్యత్‌లో ఒప్పందంతో ఆలయ భూములకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.. ఎన్నేళ్లు లీజుకు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎంతశాతం లీజుకు ఇవ్వాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్దం చేసిన డ్రాఫ్టు ఫైల్‌లో పొందుపరిచిన అంశాలలో కొన్నింటిని తొలగించి, కొన్ని చేర్చుతున్నట్లు సమాచారం. లీగల్ సలహాలు తీసుకొని ఆలయ భూములను లీజుకు ఇచ్చే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. ఈ ఆలయ భూముల్లోనే విడతల వారీగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: KTR: విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ మండిపాటు

ఒక్కో జిల్లాకు 2 సోలార్ ప్లాంట్లు… 

ఆలయ భూములను స్వశక్తి మహిళా సంఘాలకు లీజుకు ఇచ్చి సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఆ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, మరో వైపు ఆలయాలకు సైతం ఆదాయం సమకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో జిల్లాకు 2 సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో మహిళా సంఘాలు10 శాతం కాంట్రిబ్యూట్ చేస్తే 90 శాతం బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేయనున్నారు. ఇంధన శాఖ నుంచి సైతం అనుమతులు వచ్చినట్లు సమాచారం. ఒక్క మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేశారు. సోలార్ ప్లాంట్లకు ఇంధన శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు భూములకు లీజ్ ఇవ్వడంతోపాటు రుణాలు మంజూరు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

ఇప్పటి వరకు బ్యాంకులు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి. కాగా, ఒక్క మెగావాట్ సోలార్ ప్లాంట్‌కు రూ.3 కోట్లు అవుతుండటం, రూ.5లక్షల గరిష్ట పరిమితి మించుతుండటంతో వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని ఇప్పటికే సెర్ప్ కోరినట్లు సమాచారం. సాంకేతికంగా సాధ్యం కాని పక్షంలో వడ్డీలో రాయితీ కల్పించాలని, అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం దాదాపు 4 వేల ఎకరాల భూమి అవసరం కాగా రాష్ట్ర వ్యాప్తంగా స్థల సేకరణను అధికారులు పూర్తి చేశారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రత్యేక వైబ్​సైట్​ను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్లాంట్లకు సంబంధించిన విధి విధానాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది.

Also Read: Bhupalpally District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బస్టర్.. నేలకొరిగిన పత్తి మిర్చి పంట

Just In

01

WPL 2026: డబ్ల్యూ పిఎల్ 2026 రిటెన్షన్స్.. MI, DC, RCB, UPW, GG టీమ్స్ ఎవరెవర్ని దక్కించుకున్నాయంటే?

Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..

Mexican President: మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా పై లైంగిక వేధింపులు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో నేటి నుండి ముగియనున్న హోమ్ ఓటింగ్.!

Operation Chhatru: జమ్మూలో ఉగ్రవాదుల ఏరివేత.. కిష్తివాడ్‌ జిల్లాలో ఆపరేషన్ ఛత్రు ప్రారంభం